Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేతన బకాయిలు చెల్లించాలని నిరసన

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు6: పారిశుధ్య కార్మికులకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని జిల్లా మున్సిపల్‌ వర్కర్స్‌ కార్యదర్శి పెంచల నరసయ్య, బుచ్చి నగర పంచాయతీ పారిశుధ్య కార్మికులు కోరారు. సోమవారం వారు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పంచాయతీని నగర పంచాయతీగా మార్చి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు పారిశుధ్య కార్మికులకు కనీస వసతులు సమకూర్చడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించలేదన్నారు. జీతాల సమస్యపై కమిషనర్‌కు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదన్నారు. కార్మికులు అనారోగ్యం బారిన పడినా వైద్యం పొందేందుకు హెల్త్‌కార్డులు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో చల్లకొలుసు మల్లికార్జున, పోతంశెట్టి శ్రీనివాసులు,  సీఐటీయూ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement