మరింత జోష్‌!

ABN , First Publish Date - 2021-03-05T06:59:40+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన ఆ పార్టీ వర్గాల్లో మరింత జోష్‌ను నింపింది. చంద్రబాబు గురువారం నగరంలో చేపట్టిన రోడ్‌షోకు ప్రజలు నీరాజనం పలికారు

మరింత జోష్‌!
గురువారం రాత్రి నగరంలోని చెన్నమ్మ సర్కిల్‌లో చంద్రబాబు రోడ్‌ షో

  1. టీడీపీ అధినేతకు అడుగడుగునా నీరాజనం
  2. ఏకధాటిగా ఐదు గంటల పాటు రోడ్‌షో
  3. కార్యకర్తల్లో ఉత్తేజం నింపిన చంద్రబాబు ప్రసంగం
  4. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి


కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 4: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన ఆ పార్టీ వర్గాల్లో మరింత జోష్‌ను నింపింది. చంద్రబాబు గురువారం నగరంలో చేపట్టిన రోడ్‌షోకు ప్రజలు నీరాజనం పలికారు. చంద్ర బాబు ఐదు గంటల పాటు ఏకధా టిగా ఏమాత్రం అలసట లేకుండా  రోడ్డు షో కొనసాగించారు. కూడళ్ల వద్ద చంద్ర బాబు చేసిన ప్రసంగం మరింత ఉత్సాహపరిచింది. మరో వైపు పద్ధతి మార్చుకోవాలంటూ పోలీసులకు సున్నితంగా చురకలు వేశారు. కొన్నిచోట్ల జనంతోనే మాట్లాడించి వారు పడుతున్న బాధలను తెలుసుకున్నారు


టోల్‌గేటు వద్ద ఘన స్వాగతం

చంద్రబాబు హైదరాబాదు నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు పంచలింగాల టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్‌ రెడ్డి, గుంటూరు నుంచి వచ్చిన పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి రామయ్య, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, కర్నూలు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పాణ్యం పార్టీ ఇన్‌చార్జిలు టీజీ భరత్‌, కోట్ల సుజాతమ్మ, మీనాక్షి నాయుడు, తిక్కారెడ్డి, గౌరు చరితతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, నాగేంద్ర కుమార్‌, తెలుగు మహిళ కర్నూలు లోక్‌సభ అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌, ప్రధాన కార్యదర్శి సుకన్యాదేవి, హనుమంతరావు చౌదరి, సత్రం రామకృష్ణుడు, నారాయణరెడ్డి  చంద్రబాబు నాయుడుకు బొకేలతో స్వాగతం పలికారు. 


ఐదు గంటల పాటు కొనసాగిన రోడ్‌షో

చంద్రబాబు కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల  సందర్భంగా గురువారం  రోడ్‌షో నాలుగున్నర గంటల పాటు   సాగింది. టోల్‌గేటు నుంచి  నగరంలోని కింగ్‌ మార్కెట్‌ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడు.. చైతన్య వాహనం నుంచి రోడ్‌షో కొనసాగించారు. పార్టీ నాయకులు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి,   టీజీ భరత్‌, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు, గౌరు వెంకటరెడ్డి, గౌరు చరిత,  నియోజక వర్గాల ఇన్‌చార్జిలు, కార్పొరేటర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు. రోడ్‌షో పాతబస్టాండు, కొండారెడ్డి బురుజు, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా, ఆర్‌ఎస్‌ రోడ్డు కూడలి, మౌర్యఇన్‌ సర్కిల్‌ మీదుగా బళ్లారి చౌరస్తా నుంచి చెన్నమ్మ సర్కిల్‌ వరకు సాగింది. కూడళ్లలో చంద్రబాబు ప్రసంగం జనాన్ని ఉత్తేజపరిచింది. 


ప్రజల కోసమే..

తనకు పదవీ వ్యామోహం లేదని, మూడుసార్లు ముఖ్యమం త్రిగా పని చేశానని, ఈ వయస్సులో కష్టపడా ల్సిన అవసరం లేదని అన్నారు. అయితే.. ప్రజల కోసం, ప్రజాస్వా మ్యాన్ని బతికించేందుకు జగన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం వస్తోం దన్నారు. తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకురావాలని చంద్రబాబు చేసిన ప్రసంగానికి ప్రజలు జేజేలు కొట్టారు. 


పోలీసులకు చురకలు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు వైసీపీ నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో చేస్తున్న ప్రయత్నాలకు పోలీసు అధికారులు కళ్లు మూసుకుని సహ కరిస్తున్నారని, విపక్షాలను ముఖ్యంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారనీ, వీటన్నింటికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని చంద్రబాబు నాయుడు పోలీసులను హెచ్చరించారు. రాష్ట్రంలో ఏఏ నియోజకవర్గాల్లో పోలీసు అధికారులు అతిగా ప్రవర్తించారో.. నిబంధనలను తుంగలో తొక్కి తమ వారిని ఇబ్బందులకు గురి చేశారో.. అన్ని లెక్కలను రాసుకున్నానని, వడ్డీతో సహా వాటన్నిం టిని చెల్లిస్తానని పోలీసులనుద్దేశించి హెచ్చరికలు చేసినప్పుడు జనాలు చప్పట్లు కొట్టారు.


మైక్‌ ఇచ్చి.. వారి బాధలు తెలుసుకుని..

ప్రస్తుత వైసీపీ పాలనలో ఏ రకంగా తాము బాధలు పడుతున్నామో.. రోడ్‌షో సందర్భంగా చంద్రబాబుకు బాధితులు మొర పెట్టుకున్నారు. చంద్రబాబు తన ప్రసంగం మధ్యలో మైక్‌ను బాధితులకు అందించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే రేషన్‌కార్డులు తీసేస్తామని, అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చేది లేదని, అన్యాయంగా బైండోవర్‌ కేసులు నమోదు చేశారని.. పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు మొర పెట్టుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని, వైసీపీ బెదిరింపులు, దౌర్జన్యాలకు గుణపాఠం చెప్పాలని చంద్రబాబు వారిలో ధైర్యాన్ని నింపారు.


మళ్లీ ఫ్యాక్షన్‌ జగన్‌ పుణ్యమే

రాయలసీమకు చెందిన వైఎస్‌ జగన్‌ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుప డకుండా.. మళ్లీ ఫ్యాక్షనిజం పెంచి పోషిస్తున్నారు. టీడీపీ హయాంలో సీమలో ముఠా కక్షలు లేకుండా చేశాం. సీమను అభివృద్ధి చేశాం. వైసీపీ వచ్చాక అభివృద్ధి శూన్యం. ప్రజాస్వామ్యాన్ని కాలరాచేలా జగన్‌ పాలన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. - కర్నూలులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామయ్య 


వైసీపీ వచ్చాక ఇబ్బందులు

కర్నూలు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు నాయుడు రోడ్‌షోలో వైసీపీ వచ్చాక తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు విన్నవించుకున్నారు. అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చంద్రబాబు ప్రసంగించారు. కొంతమంది ప్రజలు తమకు బీమా పథకాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు వంటివి అందడం లేదని, ఇదేమిటని ప్రశ్నిస్తే అధికార పార్టీ వారు బెదిరిం పులకు దిగుతు న్నారని తమ గోడును వెళ్లబోసుకు న్నారు. దీనికి చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలని తాను ఎన్నో పథకాలు తీసుకు వస్తే వాటన్నింటిని వైసీపీ ప్రభుత్వం తీసివేసిందని, మళ్ళీ అలాంటివి రావాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పాలని పిలుపుని చ్చారు. ప్రజలకు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


స్కాలర్‌షిప్పు రావడం లేదు

నేను ఐటీఐ చదువుతు న్నాను. టీడీపీ ప్రభు త్వంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్పు వచ్చేది. ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. వైసీపీ ఎన్నికల హామీలో భాగంగా అందరికీ స్కాలర్‌ షిప్పులని చెప్పి ఇపుడు కొంతమందికి మాత్రమే ఇస్తోంది. రెండేళ్ల నుంచి స్కాలర్‌షిప్పు రావడం లేదు. మా లాంటి పేదవారు చదువు కునేదెలా? - సాయికుమార్‌, విద్యార్థి, కర్నూలు


ఇంటింటికి రేషన్‌ అని రోడ్డుపై నిలబెడుతున్నారు

ఇంటింటికీ రేషన్‌ అని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. వాహనం ఎక్కడో రోడ్డు మీద నిలబెడుతున్నారు. నడి రోడ్డు మీద, ఎండలో నిలబడాల్సి వస్తోంది. ఎందుకు ఇలా అని వైసీపీ వారిని అడిగితే బెదిరింపులకు దిగుతు న్నారు. నా ఓటు కూడా తొలగించారు. - లోకేశ్వరి, కర్నూలు

Updated Date - 2021-03-05T06:59:40+05:30 IST