Abn logo
Aug 10 2020 @ 03:47AM

హామిల్టన్‌కు షాక్‌

‘సిల్వర్‌స్టోన్‌’ విజేత వెర్‌స్టాపెన్‌

సిల్వర్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌): ఈ సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌కు రెడ్‌బుల్‌ రేసర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ షాకిచ్చాడు. ఆదివారం జరిగిన ఫార్ములావన్‌ 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ ప్రి రేసులో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన హామిల్టన్‌ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. వాల్టెరి బొటాస్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచాడు. సిల్వర్‌స్టోన్‌లో గెలవడం రెడ్‌బుల్‌కు 2012 తర్వాత ఇదే తొలిసారి. వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్‌లో ఇదే మొదటి టైటిల్‌. 

Advertisement
Advertisement
Advertisement