వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-22T06:59:02+05:30 IST

ఎర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లి పరిధిలో రుక్మిణి,సత్యబామ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా 5 వ రోజు శుక్రవారం వేణుగోపాలస్వామి తిరుణాళ్ల మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

వైభవంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు
విద్యుత్‌ ప్రభపై మాట్లాడుతున్న ఏరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం,  మే 21 : ఎర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లి పరిధిలో రుక్మిణి,సత్యబామ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా 5 వ రోజు శుక్రవారం వేణుగోపాలస్వామి తిరుణాళ్ల మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 

తిరుణాల సందర్భంగా ఎర్రగొండపాలెం వైసీపీ నాయకులు రెండు విద్యుత్‌ ప్రభలు టీడీపీ నాయకులు ఒక ప్రభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో  ఆలయకమిటి చైర్మన్‌ యక్కలి భాగ్యరావు, ఆర్యవైశ్యనాయకులు యిమ్మడిశెట్టి వెంకటసుబ్బారావ, మోతా కాపులుు సేవా కార్యక్రమాలు నిర్వమించారు. 

టీడీపీతోనే రాష్ట్ర అభవృద్ధి

రాష్ట్రంలో అభివృద్ది జరిగిందంటే ఒక్క టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు, జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్రలు అన్నారు.  మిల్లంపల్లి వేణుగోపాలస్వామి తిరునాళ్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రభపైనుంచి ఆ ఇరువురు నాయకులు మాట్లాడారు. ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ రైతుల, పేదల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్ళికానుక, రైతులకు వ్యవసాయ పరికరాలు పై ఇచ్చే 50శాతం సబ్సిడి పధకాలను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని అన్నారు.  వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక, ఇసుకధరలు, మద్యంఽదరలు, డీజిల్‌,పెట్రోలు, ధరలు,  నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేద ప్రజలు నడ్డివిరుస్తున్నారని అన్నారు. వేణుగోపాలస్వామి ఆలయం చుట్టూ, ఎర్రగొండపాలెం టౌన్‌నుంచి దేవాలయం వరకు గత టీడీపీ ప్రభుత్వం రోడ్లు నిర్మించామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, టీడీపీ  నాయకుల పాల్గొన్నారు. సభకు ముందుగా రుక్మిణి, సత్యబామ వేణుగోపాలస్వామి స్వామి ధర్శనం చేసుకున్నారు. 

మార్కాపురం వన్‌టౌన్‌ 21: స్థానిక శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయలంలో శనివారం శాంతి కల్యాణం కమనీయంగా నకుల పండుగగా జరిగింది.ఆలయ అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఉదయం చెన్నకేశవ స్వామి మూలవిరాట్‌కు సుప్రభాత సేవ, అలంకరణ ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఆలయం మధ్యరంగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ ఉత్సవ మూర్తులను ప్రత్యేక లంకరణ గావించారు. ఈ సంధర్భంగా ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ పెనుగొండ కేశవరావు, ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.

వైభవంగా వేంకటేశ్వర కల్యాణం

మార్కాపురం వన్‌టౌన్‌ 21: స్థానిక శ్రీ లక్ష్మీ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి కల్యాణ మహోత్సవ వేడుకలు శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.  స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం సందర్భంగా 12 మంది జంటలు ఉభయదాతలు పాల్గొని కల్యాణ క్రతువును జరిపించారు.  150 మంది భక్తులకు అన్నసంతర్పణ చేశారు.


Updated Date - 2022-05-22T06:59:02+05:30 IST