Sep 26 2020 @ 18:07PM

సేమ్‌ డే: 2019 వేణుమాధవ్.. 2020 ఎస్‌.పి. బాలు

గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు అంత్యక్రియలు ముగిశాయి. అయినా సరే.. ఆయన లేడంటే ఇప్పటికీ కొందరు నమ్మేలా లేరు. అంతలా అందరిలో ఆయన మమేకమయ్యారు. అయితే బాలు చనిపోయిన రోజు సినీ ఇండస్ట్రీకి నిజంగానే చీకటి రోజు. అదెలా అనుకుంటున్నారా.. 2019, సెప్టెంబర్‌ 25న అంటే సేమ్‌ టు సేమ్‌ బాలు చనిపోయిన రోజే.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఓ టాప్ కమెడియన్‌ని కోల్పోయింది. ఆ కమెడియన్‌ ఎవరో కాదు వేణుమాధవ్‌. కమెడియన్‌గా ఎంతగానో అలరించిన వేణుమాధవ్‌ సెప్టెంబర్‌ 25నే చనిపోయారు. సరిగ్గా ఏడాదికి అదే రోజు ఎస్‌. పి. బాలు దూరమవ్వడం చూస్తుంటే.. ఆ రోజు సినిమా ఇండస్ట్రీకి చీకటి రోజుగా వర్ణించక తప్పదు.

ఇదే విషయం మెగా బ్రదర్‌ నాగబాబు కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. నాకు అత్యంత ఆప్తులైన ఇద్దరినీ ఒకే రోజు ఏడాది గ్యాప్‌లో కోల్పోవడం ఎంతో బాధగా ఉంది. వేణుమాధవ్‌ కూడా మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఇక బాలు గురించి చెప్పేదేముంది. మా కుటుంబ సభ్యుడే. అలాంటి ఇద్దరూ.. ఏడాది గ్యాప్‌లో ఒకే రోజు దూరమవ్వడం మనసుని కలచివేస్తుందని తెలుపుతూ.. ఎస్‌.పి. బాలుకి నాగబాబు నివాళులు అర్పించారు.