ఊపిరాడని వెంటిలేటర్లు!

ABN , First Publish Date - 2020-09-24T14:19:48+05:30 IST

ఓ వైపు కరోనా బాధితులు జిల్లాలో సరైన సమయానికి చికిత్స అందక వెంటిలేటర్ల సదుపాయం లేక..

ఊపిరాడని వెంటిలేటర్లు!

ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?

జీజీహెచ్‌లో వినియోగంలోకి రాని వెంటిలేటర్లు

వెంటిలేటర్ల వాడడం కూడా చేతకాని అధికారులు


గుంటూరు: ఓ వైపు కరోనా బాధితులు జిల్లాలో సరైన సమయానికి చికిత్స అందక వెంటిలేటర్ల సదుపాయం లేక జీజీ హెచ్‌లో, ప్రైవేటు ఆస్పత్రులలోను పిట్టల్లా రాలిపో తుంటే ప్రభుత్వం వెంటిలేటర్లను పంపితే వాటిని వినియోగించుకోవటం కూడా జీజీహెచ్‌ అధికారులకు చేతకాకపోవడం గమనార్హం!  ఓ వైపు బెడ్లు లేవం టూ ప్రైవేటు ఆస్పత్రులు కరోనా బాధితులను భయ పెట్టి రక్తం పీల్చుకుంటున్నాయి. అయితే వెంటిలేటర్ల సదు పాయం ఎక్కువ మందికి లేక.. ఉన్నా ఆ స్థాయి ఖర్చు భరించలేక జిల్లాలో ఎందరో కరోనా బాధితులు విల విలలాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నెలరోజుల క్రితం జీజీహెచ్‌కి వంద వెంటిలేటర్లను కేటాయించి వెంటనే పంపింది. వాటన్నింటిని ఏదో ప్రదర్శనకు పెట్టినట్టు  104వ వార్డు బయట నెల రోజుల నుంచి ఉంచారు. వాటిలో కనీసం పదింటిని కూడా ఇప్పటివరకు విని యోగంలోకి తెచ్చుకోలేకపోయారు. ఓవైపు ప్రభుత్వాలు సరైన సదుపాయాలు కల్పించటం లేదని వైద్య సిబ్బం ది ఆందోళన కూడా చేస్తున్నారు.


అయితే ఇదే సమయంలో ప్రభుత్వం ఎంతో విలువైన వెంటిలేటర్ల ను సమ కూర్చితే వాటిని పేద రోగులకు వినియోగిం చటం కూడా చేతకాకపోవటం అధికా రుల, వైద్య సిబ్బంది పనితీరు ఎంత బాధ్యతా రాహిత్యంగా ఉందో తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల లో కరోనా బాధితుల కు వెంటిలేటర్లపై చికిత్స అందిస్తే రోజుకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయినా సిఫార్సు తప్ప టం లేదు. అదే సమయంలో జీజీహెచ్‌లో కూడా వెంటిలేటర్లు ఖాళీ లేవని కరోనా బాధితులను చేర్చుకోవటం లేదు. చేర్చుకున్నా ఊపిరి అందక మరణించిన వారు ఎందరో. అదే సమయంలో వెంటిలేటర్లను నెలరోజులుగా ఎందుకు వినియోగం లోకి తేవటం లేదో వారికే తెలియాలి. 

Updated Date - 2020-09-24T14:19:48+05:30 IST