Abn logo
Mar 29 2020 @ 18:42PM

వెన్నెల కిషోర్ రూ. 2 లక్షలు.. సంపూర్ణేష్ రూ. లక్ష

కరోనా వైరస్ కార‌ణంగా ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికుల‌ని ఆదుకునేందుకు టాలీవుడ్ పెద్దలు క‌రోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. చిరంజీవి నేతృత్వంలో నడుస్తున్న ఈ ఛారిటీకి భారీగా విరాళాలు వ‌స్తున్నాయి. సెలబ్రిటీలందరూ తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ రూ.2 ల‌క్ష‌లు, సంపూర్ణేష్ బాబు రూ. 1ల‌క్ష ఆర్ధిక సాయం అందించారు.


‘‘కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల తరపున సినీ పెద్దలు ముందుకొచ్చి కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అందిస్తున్న సాయానికి నా పాదాభివందనం. నా తరపున ఒక లక్ష రూపాయలు వారికి అందజేస్తాను. త్వరలోనే ఈ మహమ్మారి నుంచి  బయటపడాలని ప్రార్ధిస్తున్నాను’’ అని సంపూర్ణేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలలో అందరూ ముందుకు వచ్చి పేద కార్మికులను ఆదుకోవాలి. పెద్దలు ముందుండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా వంతుగా రూ. 2 లక్షలు సాయం చేస్తున్నానని వెన్నెల కిషోర్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement