వెంకీ నెక్స్ట్ మూవీ 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్..?

విక్టరీ వెంకటేశ్ రీమేక్ సినిమాలతో మంచి హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తమిళ హిట్ సినిమా 'అసురన్' రీమేక్ 'నారప్ప'తో పాటు మలయాళ సూపర్ హిట్ 'దృశ్యం 2' తెలుగు రీమేక్‌లలో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఓటీటీలో వచ్చిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరో మలయాళ హిట్ సినిమా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3'లో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ మరోగా హీరోగా నటిస్తున్న ఇందులో వెంకీ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. కాగా, నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా వెంకటేశ్ మలయాళ సూపర్ హిట్ 'డ్రైవింగ్ లైసెన్స్'ను రీమేక్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా 2019లో వచ్చి సూపర్ హిట్‌ను సాధించింది. ఇప్పుడిదే మూవీ రీమేక్‌లో వెంకటేశ్ నటించబోతున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement