సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ హోస్టుగా మారబోతున్నరట. ఇప్పటికే స్టార్ హీరోలు స్మాల్ స్క్రీన్ మీద హోస్టుగా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రానా దగ్గుబాటి, ఎన్.టి.ఆర్, నాని, సమంత ఇప్పటికే బుల్లితెర మీద రియాలిటీ షోలకు హోస్టులుగా చేసి అలరించారు. ప్రస్తుతం 'ఆహా'లో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షోతో బాలకృష్ణ కూడా హోస్టుగా అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ 'ఆహా' కోసం ఓ సరికొత్త ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంను ప్లాన్ చేస్తున్నారట. దీనికి వెంకటేశ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. వెంకీ అభిమానులు మాత్రం ఆయనను హోస్ట్‌గా చూడాలని ఆశపడుతున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.