Lakshya : ట్రైలర్ లాంఛ్ చేసేది ఆ హీరోనా?

యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఏసియా సునీల్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రచార కార్యక్రమాల్ని కూడా మొదలు పెట్టేశారు. డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా.. ఆర్చరీ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందింది. ఇందులో నాగశౌర్య విలుకాడుగా అదరగొట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మేకోవర్ ఆకట్టుకుంటోంది. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి ప్రత్యేకించి సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేశారు నాగశౌర్య. ఇంతకు ముందు విడుదలైన టీజర్, సింగిల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 1న విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా లాంఛ్ చేయబోతున్నారు. 


కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ‘లక్ష్య’ మూవీలో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తుండగా.. మరో ముఖ్యమైన పాత్రను సచిన్ ఖేడ్కర్ పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఆర్చరీ నేపథ్యంలో తెలుగులో రానున్న మొట్టమొదటి చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈసినిమా నాగశౌర్యకి మంచి పేరు తెస్తుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. మరి ‘లక్ష్య’ మూవీతో శౌర్య ఏ రేంజ్ లో సక్సెస్ లక్ష్యాన్ని ఛేదిస్తారో చూడాలి. 


Advertisement