వెంకయ్యపేటను వీడని జ్వరాలు

ABN , First Publish Date - 2022-08-09T05:31:23+05:30 IST

వెంకయ్యపేటను వీడని జ్వరాలు

వెంకయ్యపేటను వీడని జ్వరాలు
శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తవిటి నాయుడి భార్య, పిల్లలు

- పట్టించుకోని వైద్యాధికారులు

- ఒకే ఇంటిలో ముగ్గురికి డెంగ్యూ

- ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరుతున్న జ్వరపీడితులు 

ఆమదాలవలస: పురపాలక సంఘ పరిధిలోని వెంకయ్యపేట గ్రామాన్ని విషజ్వరాలు వీడటం లేదు. 50 మందికి పైగా జ్వరాలతో బాధపడుతుననట్టు భాదితులు ఉన్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు. ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ప్లేట్‌ లెట్స్‌ డౌన్‌ అయినవారే ఉన్నారు. గొండు తవిటినాయుడు కుమారులు ప్రనీత్‌, నిఖిల్‌కు డెంగ్యూ నిర్ధారణ అయింది. దీంతో తవిటినాయుడి భార్య కుసుమకుమారికి రక్త పరీక్షలు చేయగా డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో వీరంతా శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ వైద్యులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేలాది రూపాయాలు చెల్లించి చికిత్స పొందుతున్నట్టు గ్రామస్థులు వాపోతున్నారు. ఈ గ్రామం మోనంగి వీధిలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వస్తుంది. అక్కడ పనిచేస్తున్న వైద్యురాలు తరచూ విధులకు గైర్హజరు అవుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈమెపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇటీవల జిల్లా మలేరియా నివారణాధికారి ఆరోగ్య కేద్రం పరిశీలన సందర్భంగా వైద్యురాలు లేక పోవడం గుర్తించారు. అయినా వైద్యురాలిపై ఎటువంటి చర్యలు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాఽథాన్యం ఇస్తుందని పాలకులు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో కాన రావటం లేదు. ఈ విషయమై వివరణక అడిగేందుకు ఫోన్‌లో ప్రయత్నించినా జిల్లా వైద్యాధికారి అందుబాటులో లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జిల్లా అధికారుల పరిస్థితి ఇలా ఉంటే వైద్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అన్ని స్థానికంగా చర్చించుకుంటున్నారు. వెంకయ్యపేట గ్రామంలో కనీసం రక్త నమూనాలు సేకరించే ప్రయత్నం కూడా చేయకపోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. 


కమిషనర్‌ పరిశీలన...

వెంకయ్యపేటలోని పరిస్థితిని ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి పురపాలక సంఘం కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ స్పందించి ఆ గ్రామాన్ని సోమవారం పరిశీలించారు. పారిశుధ్య పనులు చే యించారు. ఇళ్ల ముందు బ్లీచింగ్‌, దోమల నివారణ మందు స్ర్పే చేయించారు. మంగళవారం గ్రామంలో పూర్తి స్థాయిలో పారిశుధ్య పనులు చేపడతామని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చే యాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-09T05:31:23+05:30 IST