Aug 16 2021 @ 08:40AM

హిందీ వెబ్ సిరీస్‌లో వెంకటేశ్-రానా..!

సినీ ఇండ‌స్ట్రీ వార‌సుల్లో బాబాయ్‌.. అబ్బాయ్ అయిన సీనియ‌ర్ అగ్ర హీరో విక్ట‌రీ వెంక‌టేశ్, రానా ద‌గ్గుబాటితో క‌లిసి న‌టిస్తే చూడాల‌ని చాలా రోజుల నుంచి అభిమానులు అనుకుంటున్నారు. ఇది వ‌ర‌కు రానా హీరోగా చేసిన‌ కృష్ణం వందే జ‌గ‌ద్గుర‌మ్ సినిమాలో ఓ పాట‌లో వెంక‌టేశ్ త‌ళుక్కున మెరిశారు. అయితే వీరిద్ద‌రూ పూర్తిస్థాయి పాత్ర‌ల్లో న‌టిస్తే చూడాల‌ని ఫ్యాన్స్ కోరిక‌. లేటెస్ట్ సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు త్వ‌ర‌లోనే అభిమానుల కోరిక తీర‌బోతుంది.  వివ‌రాల్లోకెళ్తే.. వెంక‌టేశ్‌, రానా ద‌గ్గుబాటి ఓ హిందీ వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతున్నారు. దీన్ని ఇత‌ర భాష‌ల్లోని అనువాదం చేసి విడుద‌ల చేస్తార‌ని, ప్ర‌ముఖ డిజిటల్ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఇటు వెంక‌టేశ్‌, అటు రానా ఇద్ద‌రూ వారి సినిమాల కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. వ‌చ్చే ఏడాదిలోనే ఈ వెబ్ సిరీస్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌.