వెంకటేశా.. ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించు : బీకే

ABN , First Publish Date - 2022-09-28T05:50:47+05:30 IST

తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగం గా పట్టు వస్ర్తాలు సమర్పించడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఆస్వామి మంచి బుద్ది ప్రసాదించాలని టీడీపీ హిందూ పురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు.

వెంకటేశా.. ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించు : బీకే
పార్థసారథిని సన్మానిస్తున్న బోయ రామాంజనేయులు

పెనుకొండ, సెప్టెంబరు 27: తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగం గా పట్టు వస్ర్తాలు సమర్పించడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఆస్వామి మంచి బుద్ది ప్రసాదించాలని టీడీపీ హిందూ పురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం దసరా ఉత్సవాల్లో భాగంగా ఆయనతోపాటు టీడీపీ నాయకు లు స్థానిక లక్ష్మీవెంకటరమణస్వామి, వాసవీకన్యకాపరేశ్వరీ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రమే్‌షస్వామి, గిరిస్వామి వారిని పట్టువస్ర్తాలతో సత్కరించారు. అనంతరం బీకే వి లేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును తొ లగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. యుగపురుషుడు నందమూరి తారకరామారావు పేరు కొనసాగించాలని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తె లిపారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మంచి బుద్ది ప్రసాదించాల ని తిరుమల వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ కేశవయ్య, పట్టణ కన్వీనర్‌ రవిశంకర్‌, జిల్లా అధికార ప్రతినిధి రఘువీర చౌదరి, సీనియర్‌ నాయకులు రామక్రిష్ట ప్ప, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు అశ్వర్థనారాయణ, కురు బ కృష్ణమూర్తి, టీఎనటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు చంద్ర, నియోజకవర్గ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణరెడ్డి, కన్నాస్వామి, తోటగేరి శీన, నరేంద్ర, గీతా హనుమంతు, మాజీ సర్పంచ చంద్రకాంత మ్మ, నారాయణనాయక్‌, మహిళా అధ్యక్షురాలు గాయత్రి, బాబుల్‌రె డ్డి, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణరెడ్డి, వడ్డి చంద్ర, అక్కులప్ప, సుధాకర్‌, వడ్డి ఆది, శీన పాల్గొన్నారు.   


పెనుకొండ మండల టీడీపీ మాజీ కన్వీనర్‌ శ్రీరాములు యాదవ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీ సుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బీకే పార్థసారథితో పాటు నాయకులు కేశవయ్య, పాలడుగు చంద్ర, దారపునేని రామచంద్ర, చంద్ర తదితరులు ఆయన్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ధైర్యం చెప్పారు. 


పార్థసారథికి సన్మానం 

జిల్లా వాల్మీకి బోయ సాధికార సమితి అధ్యక్షునిగా ఎంపికైన బో య రామాంజనేయులు పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో బీకే పార్థసారథిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసందర్భంగా పూ లమాల వేసి, శాలువాకప్పి సత్కరించారు. కార్యక్రమంలో పుట్టపర్తి మాజీ మున్సిపల్‌ చైర్మన బెస్త చలపతి,  జిల్లా టీడీపీ బీసీసెల్‌ ఉపాధ్యక్షులు కొడపగానిపల్లి శివ, పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మనోహర్‌, రాంపురం సర్పంచ శ్రీనివాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-28T05:50:47+05:30 IST