నెల్లూరు జిల్లా: వెంకటగిరి పోలీస్టేషన్ మూసివేత

ABN , First Publish Date - 2020-07-05T20:13:49+05:30 IST

కరోనా దెబ్బకు నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు.

నెల్లూరు జిల్లా: వెంకటగిరి పోలీస్టేషన్ మూసివేత

నెల్లూరు జిల్లా: కరోనా దెబ్బకు నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు. ఆ స్టేషన్‌లో పనిచేసే దాదాపు అందరికీ కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. మొత్తం 11 మంది పోలీసులు, సిబ్బందికి వైరస్ సోకింది. ఓ హత్య కేసులో నిందితుల ద్వారా కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. వెంకటగిరి సీఐతోపాటు, ఎస్ఐ, ఏడుగురు పోలీసులకు, హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయింది. అలాగే స్వీపర్లకు వైరస్ సోకింది. దీంతో పోలీస్ స్టేషన్‌ను మూసివేసి వారందరినీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

Updated Date - 2020-07-05T20:13:49+05:30 IST