Venkanna: కాఫీ పౌడర్‌తో 50 అడుగుల క్లాత్‌పై వెంకన్న చిత్రం

ABN , First Publish Date - 2022-09-23T02:37:19+05:30 IST

0 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని వేసిన తిరుమల యువకుడి పేరు ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయింది.

Venkanna: కాఫీ పౌడర్‌తో 50 అడుగుల క్లాత్‌పై వెంకన్న చిత్రం

తిరుమల: 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని వేసిన తిరుమల యువకుడి పేరు ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయింది. తిరుమలకు చెందిన పల్లి చిరంజీవి మైక్రో ఆర్టిస్ట్‌. బియ్యపు, చింతగింజలపై జాతీయపతాకం, జాతీయ నేతలు, శ్రీవారు, అమ్మవార్ల బొమ్మలు వేసి పేరు పొందాడు.ఈ నెల 27నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు మురంశెట్టి రాములు సూచన మేరకు 50 అడుగుల క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో శ్రీవారి చిత్రాన్ని గీశాడు. తిరుపతిలోని ఆర్య నివాస్‌లో 20 రోజుల పాటు ఈ చిత్రాన్ని వేశాడు. ఏడు కొండలకు సూచికగా ఏడు కేజీల కాఫీ పౌడర్‌ను వినియోగించాడు. దీన్ని అభినందిస్తూ ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌ నరేంద్ర గౌడ్‌, ఆస్ర్టేలియా చీఫ్‌ కోఆర్డినేటర్‌ బలరాం కృష్ణ షీల్డ్‌, మెడల్‌ను గురువారం తిరుమలలోని కల్యాణవేదికలో చిరంజీవికి అందజేశారు. అనంతరం నరేంద్రగౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ లండన్‌ కేంద్రంగా ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ను 2010లో ప్రారంభించామని తెలిపారు. స్వామి ఆశీస్సులతోనే ఈ భారీ చిత్రాన్ని గోవిందనామాలు స్మరించుకుంటూ వేశానని చిరంజీవి తెలిపారు. ఈ చిత్రాన్ని కటౌట్‌గా ఏర్పాటు చేయాలని టీటీడీని కోరగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఆవ గింజ నుంచి ఆకాశం వరకు బొమ్మలు గీయాలనేది తన సంకల్పమని చిరంజీవి వివరించాడు.

Updated Date - 2022-09-23T02:37:19+05:30 IST