పేగుబంధాన్ని కాపాడాలే తప్ప తుంచకూడదు: ఉపరాష్ట్రపతి వెంకయ్య

ABN , First Publish Date - 2022-04-19T00:25:11+05:30 IST

శాస్త్ర, సాంకేతిక ఫలాలు ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలే తప్ప, బానిసలుగా మార్చకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

పేగుబంధాన్ని కాపాడాలే తప్ప తుంచకూడదు: ఉపరాష్ట్రపతి వెంకయ్య

కృష్ణా: శాస్త్ర, సాంకేతిక ఫలాలు ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలే తప్ప బానిసలుగా మార్చకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంకయ్య  మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత సవాళ్లకు పరిష్కారాలను అందించే సాంకేతికతను అందించాలన్నారు. ప్రకృతితో మానవుడికి ఉన్న పేగుబంధాన్ని విజ్ఞానం కాపాడాలే తప్ప, తుంచకూడదని సూచించారు. శాస్త్ర సాంకేతికతలు కొన్నివర్గాల కోసమే కాదు, అవి ప్రజల సంఘటిత అభివృద్ధి కోసమని చెప్పారు. శాస్త్ర, పరిజ్ఞానం సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలన్నదే యలవర్తి నాయుడమ్మ  ఆకాంక్ష అన్నారు. మహిళా సాధికారత విషయంలోనూ నాయుడమ్మ దృష్టి కోణం ప్రత్యేకమైనదని వెంకయ్యనాయుడు తెలిపారు.


విజయవాడ నుంచి విశాఖకు వెంకయ్య 

విజయవాడ నుంచి విశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఉపరాష్ట్రపతితో కలిసి మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు బయలుదేరి వెళ్లారు. 

Updated Date - 2022-04-19T00:25:11+05:30 IST