హైడ్రోకార్బన్ల పరిశోధనల్లో మరింత పురోగతి అవసరం: భారత ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-01-21T19:42:35+05:30 IST

పెట్రోలియం పరిశోధనలో ఐఐపీఈ పాత్ర కీలక భూమిక పోషించాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

హైడ్రోకార్బన్ల పరిశోధనల్లో మరింత పురోగతి అవసరం: భారత ఉపరాష్ట్రపతి

విశాఖపట్నం: పెట్రోలియం పరిశోధనలో ఐఐపీఈ పాత్ర కీలక భూమిక పోషించాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో ఐఐపీఈ తొలి వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైడ్రోకార్బన్ల పరిశోధనల్లో మరింత పురోగతి అవసరమని, చమురు వినియోగంలో భారత్ మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ అంశంలో ఇండియా స్వావలంభన సాధించాలన్నారు. సోలార్, విండ్, టైడల్ ఎనర్జీలను ప్రత్యామ్నాయ వనరులుగా అభివృద్ధి చేసుకోవాలని, స్వయంసమృద్దే ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యమని పేర్కొన్నారు.  దేశంలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇది మంచి సంకేతమన్నారు. ప్రత్నామ్నాయ ఇంధన వనరులు అభివృద్ధిలో యువత పరిశోధనలు జరపాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ల  డ్రైవ్‌లో భారతదేశం అతిపెద్ద ప్రక్రియను చేపట్టిందన్నారు. ఆరోగ్యం పట్ల ఎవరికి వారు స్వీయ బాధ్యత వహించాలని వెంకయ్య నాయుడు అన్నారు.

Updated Date - 2022-01-21T19:42:35+05:30 IST