Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉప రాష్ట్రపతి

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నివాసానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చారు. రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ ఆర్థిక విషయాల్లో రోశయ్య దిట్టని కొనియాడారు. అసెంబ్లీలో 15సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనేదేనన్నారు. తెలుగు తనానికి రోశయ్య నిలువెత్తు నిదర్శనమన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ప్రజా సమస్యలపై అనేకసార్లు కలసి పనిచేశామన్నారు. చిన్ననాటి నుంచి రోశయ్య తనకు తెలుసునన్నారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఫోన్‌లో అనేకసార్లు మాట్లాడుకున్నామన్నారు. ప్రజా జీవితంలో సంప్రదాయాలు, విలువలు పాటించాలని రోశయ్య తాపత్రయపడేవారన్నారు. మండలి, అసెంబ్లీలో సామాన్యులను ప్రభావితం చేసేలా రోశయ్య ప్రసంగాలు ఉండేవని, ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి చట్టసభల్లో మాట్లాడేవారన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని వెంకయ్య నాయుడు అన్నారు.

Advertisement
Advertisement