Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెన్నైలో వెంకయ్య ‘భోగి’ వేడుకలు

చెన్నై, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. స్థానిక కోట్టూరుపురంలోని తన స్వగృహం ఎదుట వెంకయ్యనాయుడు, ఆయన సతీమణి ఉష భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలకు నమస్కరిస్తూ ఇరువురూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సంక్రాంతి వేడుకలను కూడా వెంకయ్య చెన్నైలోనే జరుపుకోనున్నారు. అనంతరం 17న విజయవాడ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్థానిక సాలిగ్రామంలోని తన నివానగృహంలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. 

Advertisement
Advertisement