Vemulawada రాజరాజేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-12-14T12:34:47+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర సోమవారం సందర్భంగా ‘హరహర మహదేవ.. శంభో శంకర’ అంటూ భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని ...

Vemulawada రాజరాజేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర సోమవారం సందర్భంగా ‘హరహర మహదేవ.. శంభో శంకర’ అంటూ భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో ఆదిదేవుడు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో  భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునే ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులుదీరడంతో కోడెల క్యూలైన్‌ వీఐపీ పార్కింగ్‌ స్థలం వరకు సాగింది. కోడెమొక్కుల చెల్లింపునకు సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం అవసరమైంది. లఘుదర్శనం అమలు చేసినా స్వామివారి సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు.

Updated Date - 2021-12-14T12:34:47+05:30 IST