Abn logo
Sep 18 2021 @ 00:56AM

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ, సెప్టెంబరు 17 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామి దేవస్థానం శుక్రవారం  భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన  స్వామివారిని దర్శించుకున్నారు.  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. బాలాత్రిపురాసుందరీ దేవి ఆలయంలో అమ్మవారి కుంకుమపూజలో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.  భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు  ఏర్పాట్లు చేశారు. 

 రాజన్న సేవలో అదనపు ఎస్పీ

రాజరాజేశ్వరస్వామివారిని ములుగు జిల్లా అదనపు ఎస్పీ చెన్నూరి రూపేష్‌ శుక్రవారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆయనను ఆశీ ర్వదించారు.  ఆలయ పీఆర్‌వో చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌ రాజశేఖర్‌ ప్రసాదం అందజేశారు.