వేములవాడలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

ABN , First Publish Date - 2022-03-01T13:16:36+05:30 IST

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

వేములవాడలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

రాజన్న సిరిసిల్ల: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే రాజన్న భక్తులు ఆలయానికి భారీగా చేరుకున్నారు. వేడుకలలో భాగంగా స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించనుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున  మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

Updated Date - 2022-03-01T13:16:36+05:30 IST