2023లో Veluruలో వేసవి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-05-08T15:19:30+05:30 IST

జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా వచ్చే 2023లో వేసవి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌

2023లో Veluruలో వేసవి ఉత్సవాలు

వేలూరు(చెన్నై): జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా వచ్చే 2023లో వేసవి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ విలేఖరులతో మాట్లాడుతూ,  జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కా ర్యాలయాలను డిజిలైటేషన్‌ చేసి ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా సమస్యలు, ఫిర్యాదులు తెలిపేలా చర్యలు చేపట్టామన్నారు. కేంద్రప్రభుత్వ ఉడాన్‌ పథకంలో భాగంగా విమానాశ్రయ విస్తరణ పనులు త్వరలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే, పట్టణంలో చేపట్టిన స్మార్ట్‌ సిటీ పథక పనులు కూడా వేగవంతం చేయనున్నామన్నారు. జిల్లాను పర్యాటకు ప్రాంతంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించామని, ఈ పనులు పూర్తిచేసి 2023లో వేసవి ఉత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Read more