ఒక స్త్రీ కారణంగా..

ABN , First Publish Date - 2021-12-20T05:47:01+05:30 IST

నేను ఈ నగరానికి వచ్చా ఒక స్త్రీతో యాదృచ్ఛికంగా కలిసేందుకు, ఇప్పటికి ఏడేళ్ళు గడిచిపోయాయి.

ఒక స్త్రీ కారణంగా..

నేను ఈ నగరానికి వచ్చా ఒక స్త్రీతో యాదృచ్ఛికంగా కలిసేందుకు, ఇప్పటికి ఏడేళ్ళు గడిచిపోయాయి. నేను వంతెన దాటి అటుపక్కనున్న నగరానికి పోయా కారణం? ఒక స్త్రీని కలిసేందుకు (ఇదీ యాదృచ్ఛికమే!). నేనెక్కడెక్కడకి వెళ్ళినా అందుక్కారణం ఒక స్త్రీయే. స్త్రీలు నమ్మకద్రోహులనే నా బోలు వాదనలు ఉన్నప్పటికీ, నా మార్గనిర్దేశి ఎల్లప్పుడూ ఒక స్త్రీయే. ఒక స్త్రీ నాకు జన్మనిచ్చింది, మరొక స్త్రీ నా వేళ్ళు పట్టుకుని రాయించడం ప్రారంభించింది (ఆమె మరణించిన తరువాత కూడా ఆమే రాస్తోంది). నేను నివసించిన ప్రతి ఇల్లు ఒక స్త్రీ నిర్మించినదే లేదా ఆ ఇల్లు ఒక స్త్రీ సొంతం లేదంటే ఆ ఇల్లు ఒక స్త్రీ కోల్పోయిందే. నా దేశం ఒక స్త్రీ, ఈ మాతృదేవత వీధుల్లోనే నేను ఒక శిలువను లాగుతా ఆమె కూడా ఒక స్త్రీయే. గత జీవితంలో, నా శవం బహిరంగంగా పడి ఉన్నప్పుడు నన్ను పాతిపెట్టటానికి వాళ్ళు నిషేధించారు, నీడ పాటు నుండి వచ్చింది ఒక స్త్రీ నన్ను భూమిలో పాతించడానికి. నన్ను ఎవ్వరూ నమ్మనప్పుడు, ఒక స్త్రీ నన్ను నమ్మింది, ఒక స్త్రీ కారణంగా నేను జీవితాన్ని పూర్తిగా జీవించా. నా శవపేటికను మోసుకువెళ్ళే ఈ సమయంలో పురుషులు మాత్రమే ఉండటం విచారకరం.

(Najwan Darwish కవితాసంకలనం 

‘Exhausted on the Cross’  నుంచి)

తెలుగు అనుసృజన వేలూరి వేంకటేశ్వర రావు

Updated Date - 2021-12-20T05:47:01+05:30 IST