Advertisement
Advertisement
Abn logo
Advertisement

Visakha: వెలుగు ఉద్యోగుల ఆందోళన

విశాఖ: తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ వెలుగు వీఓఏ ఉద్యోగులు సోమవారం ఛలో పీడీ ఆఫీసుకు పిలుపు ఇచ్చారు. విశాఖలో ఎంపీపీ కాలనీలో కార్యాలయం వద్ద వెలుగు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రధానంగా వెలుగు వీఓఏల ఉద్యోగాల తొలగింపు సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఆఫీసు ముట్టడికి ఉద్యోగులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఐకేపీ వ్యవస్థను బలహీనపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరిసింహరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో అన్నారు.

Advertisement
Advertisement