వెలుగు ఏపీఎం సరెండర్‌

ABN , First Publish Date - 2020-11-29T04:59:06+05:30 IST

సీతంపేట వెలుగు ఏపీఎం పార్వతిని సెర్ప్‌కు సరెండర్‌ చేస్తూ ఐటీడీఏ పీవో సీహెచ శ్రీధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. సీతంపేట మండలంలో మహిళా సంఘాలపై వెలుగు ఏపీఎం అనుచితంగా వ్యవహరిస్తూ.. అక్రమాలకు పాల్పడుతోందని పీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు.

వెలుగు ఏపీఎం సరెండర్‌




సీతంపేట, నవంబరు 28 : సీతంపేట వెలుగు ఏపీఎం పార్వతిని సెర్ప్‌కు సరెండర్‌ చేస్తూ ఐటీడీఏ పీవో సీహెచ శ్రీధర్‌ ఉత్తర్వులు జారీచేశారు. సీతంపేట మండలంలో మహిళా సంఘాలపై వెలుగు ఏపీఎం అనుచితంగా వ్యవహరిస్తూ.. అక్రమాలకు పాల్పడుతోందని పీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు. గతంలో మందస ఏపీఎంగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమెను విధుల నుంచి తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మహిళా సంఘాల పొదుపు లక్ష్యాలు పూర్తి చేయకపోవడం, ప్రభుత్వం ఆదేశించిన పనులను సకాలంలో నిర్వర్తించకపోవడాన్ని పీవో గుర్తించారు. దీంతో ఆమెను సరెండర్‌ చేశారు. ఆమె స్థానంలో సీసీ పి.భవానీరావునుఇన్‌చార్జి ఏపీఎంగా నియమించారు. ఈ విషయమై వెలుగు ఏపీడీ డైజీ వద్ద ప్రస్తావించగా, ఏపీఎం పార్వతిని సరెండర్‌ చేసిన మాట వాస్తవమేనని ధ్రువీకరించారు.  

Updated Date - 2020-11-29T04:59:06+05:30 IST