వెలుగొండ.. స్మగ్లర్ల బంగారు కొండ!

ABN , First Publish Date - 2021-01-19T05:12:45+05:30 IST

జిల్లా సరిహద్దు మండలం మర్రిపాడు మండలంలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో జోరుగా ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

వెలుగొండ.. స్మగ్లర్ల బంగారు కొండ!
వెలుగొండ అడవిలో ఇటీవల పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు (ఫైల్‌)

యథేచ్ఛగా ఎర్రచందనం రవాణా

సరిహద్దులో తమిళ కూలీలు

కూంబింగ్‌ నిర్వహిస్తున్న అటవీశాఖాధికారులు


మర్రిపాడు, జనవరి 18 : జిల్లా సరిహద్దు మండలం మర్రిపాడు మండలంలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో జోరుగా ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దీంతో ఈ వెలుగొండ స్మగ్లర్ల బంగారు కొండగా మారింది. తమిళ కూలీలు అటవీ ప్రాంతంలోకి చొరబడి రవాణాను సాగిస్తున్నా సంబంధిత అటవీశాఖాధికారులు కూంబింగ్‌ నిర్వహించి ఎర్రచందనాన్ని స్వాధీన పరుచుకుంటున్నారు. అయితే వాళ్ల కళ్లు గప్పి అక్రమ రవాణాను సాగిస్తుండటంలో విఫలమవుతున్నారు. ఏల్లాలోని మర్రిపాడు మండల ప్రాంతంలోని వెలుగొండ అడవుల్లో యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతోంది. ఏకంగా తమిళనాడు నుంచి కూలీలు వచ్చి మకాం వేశారు. గత కొన్ని రోజుల క్రితం పోలీసులు, అటవీశాధికారులు కూంబింగ్‌ నిర్వహించగా స్వల్పంగా దుంగలు దొరికాయి. అదే రోజు 40 మంది కూలీలు పరారయ్యారు. ఇటీవల రెండు రోజుల క్రితం రూ. 2లక్షల విలువ చేసే ఎర్రచందనంతోపాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతంలో ఎర్రచందనం సంవృద్ధిగా దొరుకుతుండటంతో స్మగ్లర్ల పాగా ఇక్కడే వేశారు. అయితే స్థానికంగా కొంతమంది సహకరిస్తుండటంతో వారి పని సులువుగా సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఎర్ర బంగారం మర్రిపాడు మండలం నుంచి యథేచ్చగా సాగుతుందనడానికి పట్టుబడ్డ ఎర్రచందనాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. 

Updated Date - 2021-01-19T05:12:45+05:30 IST