కన్నులపండువుగా వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల మహోత్సవం

ABN , First Publish Date - 2022-01-23T06:13:23+05:30 IST

వేల్పులవీధిగౌరీ పరమేశ్వరుల మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు.

కన్నులపండువుగా వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల మహోత్సవం
గౌరీపరమేశ్వరుల మహోత్సవానికి హాజరైన జన సందోహం

భారీగా తరలివచ్చిన భక్తజనం

ఆకట్టుకున్న నేలవేషాలు, కోలాటాలు

ఉత్సవమూర్తులను దర్శించుకున్న ప్రముఖులు


తుమ్మపాల, జనవరి 22: వేల్పులవీధిగౌరీ పరమేశ్వరుల మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. ప్రధాన రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. పట్టణ పురవీధుల్లో మేళతాళాలు, డప్పువాయిద్యాలతో ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, మాజీ ఎమ్మెల్సీలు బుద్ద నాగజగదీశ్వరరావు, పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, వైసీపీ నాయకులు మందపాటి జానకిరామరాజు, జాజుల రమేశ్‌, టీడీపీ నాయకులు మాదంశెట్టి చినతల్లి, నీలబాబు, కోట్ని బాలాజీ, మళ్ల సురేంద్ర, బీఎస్‌ఎంకె జోగినాయుడు, కాయల మురళీ, పోలారపు త్రినాథ్‌ బి.శ్రీనివాసరావు, డి.విష్ణుచౌదరితో పాటు రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కనకమహలక్ష్మి తదితరులు గౌరీపరమేశ్వరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారికి దుశ్శాలువాలను కప్పి జ్ఞాపికలను అందజేశారు. ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసిన పులివేషాలు, తప్పెటగుళ్లు, చిటికెల భజనలు, కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆట వస్తువులు, ఇంటి సామగ్రి, తినుబండారాల అమ్మకాలు జోరుగా జరిగాయి. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు బొద్దపు ప్రసాద్‌, ఉమామహేశ్వరరావు, వాసు, చిరంజీవి, రమణ, వాకాడ బాబు, మద్దాల కూర్మారావు, బుదిరెడ్డి మురళీ అన్ని ఏర్పాట్లను చేశారు. 

Updated Date - 2022-01-23T06:13:23+05:30 IST