మంత్రి వెలంపల్లి అరాచకాలు మీ పార్టీ వాళ్లే చెబుతున్నారు

ABN , First Publish Date - 2020-06-05T15:27:47+05:30 IST

‘రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అవినీతి, అరాచకాల గురించి..

మంత్రి వెలంపల్లి అరాచకాలు మీ పార్టీ వాళ్లే చెబుతున్నారు

ఎంపీ కేశినేని నాని ట్వీట్


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అవినీతి, అరాచకాల గురించి మేం కాదు.. మీ పార్టీ వాళ్లే చెబుతున్నారు. కొంచెం గమనించండి జగన్ గారూ!’ అంటూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) గురువారం ట్వీట్ చేశారు. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమలో కొంతమంది కార్యకర్తలు సమావేశమై మంత్రికి వ్యతిరేకంగా సీఎంకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని ఉంటంకిస్తూ ఎంపీ కేశినేని ఈ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-06-05T15:27:47+05:30 IST