Abn logo
Sep 25 2021 @ 00:25AM

వెలిగొండ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

 కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 24 : వెలిగొండ ప్రాజెక్టు భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులు ఉంటే వాటిని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అర్హుల జాబితాను కలెక్టర్‌ ఆమోదించారు. పునరావాసానికి సంబంధించిన అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో జేసీ వెంకటమురళీ, కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజిత్‌సింగ్‌, స్పెషల్‌ కలెక్టర్‌ సరళావందనం, మార్కాపురం ఆర్డీవో శివజ్యోతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మర్దన్‌ఆలీ, స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్‌ గ్లోరియా పాల్గొన్నారు. అనంతరం సచివాల యా లు, ఆర్‌బీకేలు, వైఎస్సార్‌హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలపై ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష చేశారు.  నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ చేతన్‌ పాల్గొన్నారు.