తమిళనాడు, కేరళ జాతీయ రహదారిపై ఏనుగు.. గంటపాటు వాహనాల నిలిపివేత.. ఇంతకీ కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-06T21:22:15+05:30 IST

అటవీ ప్రాంతాల్లో ఒక్కోసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. సమీపంలోని రోడ్లు, గ్రామాల్లో జంతువుల సంచారానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తరచూ..

తమిళనాడు, కేరళ జాతీయ రహదారిపై ఏనుగు.. గంటపాటు వాహనాల నిలిపివేత.. ఇంతకీ కారణం ఏంటంటే..

అటవీ ప్రాంతాల్లో ఒక్కోసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. సమీపంలోని రోడ్లు, గ్రామాల్లో జంతువుల సంచారానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటివి చూసినప్పుడు మనకు విచిత్రం అనిపించినా.. స్థానికులకు మాత్రం రోజూ షరామామూలే అన్నట్లుగా ఉంటుంది. తమిళనాడు, కేరళ జాతీయ రహదారిపై తాజగా ఓ ఘటన చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును అధికారులు సుమారు సుమారు గంట పాటు బ్లాక్ చేశారు. ఎవరైనా వీఐపీ వస్తున్నారేమో అని అంతా అనుకున్నారు. అయితే రోడ్డుపై ఓ ఏనుగు ఉండడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారని చివరకు తెలుసుకున్నారు. ఇంతకీ అధికారులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..


తమిళనాడు, కేరళను కలిపే జాతీయ రహదారిని అధికారులు దాదాపు గంట పాటు దిగ్భందించారు. ఎవరైనా వీఐపీ వస్తున్నారేమో అని వాహనదారులు అనుకున్నారు. అయితే కొద్ది సేపటికి అసలు విషయం తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. ఇడుక్కిలోని మరయూర్ ప్రాంత సమీపంలో మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ఏనుగుల మంద రోడ్డు దాటుతూ ఉంది. అయితే వాటిలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు రోడ్డు మధ్యలోకి రాగానే ప్రసవించింది. దీంతో అధికారులు గమనించి రోడ్డుకు ఇరువైపులా వాహనాలు రాకుండా కట్టడి చేశారు. ప్రసవించిన ఏనుగు, పిల్లతో సహా అక్కడి నుంచి వెళ్లే వరకూ వాహనాలను నిలిపేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు పలు చానెళ్లలో ప్రసారం అయ్యాయి. ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని.. తరచూ చోటుచేసుకుంటుంటాయని అటవీ అధికారులు తెలిపారు. మొత్తానికి ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చూసిన ఏనుగు.. చివరికి ఏం చేసిందో చూడండి..



Updated Date - 2022-07-06T21:22:15+05:30 IST