యోగి నేతృత్వంలోని యూపీలో వాహనాలు ఎప్పుడైనా బోల్తా పడొచ్చు : బీజేపీ నేత

ABN , First Publish Date - 2020-10-01T00:29:23+05:30 IST

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాహనాలు ఏదో ఓ సమయంలో బోల్తా పడతాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్

యోగి నేతృత్వంలోని యూపీలో వాహనాలు ఎప్పుడైనా బోల్తా పడొచ్చు : బీజేపీ నేత

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాహనాలు ఏదో ఓ సమయంలో బోల్తా పడతాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ అన్నారు. పందొమ్మిదేళ్ళ దళిత యువతిపై అగ్ర వర్ణాలకు చెందిన నలుగురు సామూహిక అత్యాచారం చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కైలాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ సంఘటనను గుర్తు చేస్తున్నాయి. 


హత్రస్‌లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసు గురించి మాట్లాడుతూ, ఈ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను జైలుకు పంపుతారన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని, ఆయన రాష్ట్రంలో వాహనాలు ఏ సమయంలోనైనా బోల్తా పడవచ్చునని అన్నారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని హత్రస్ జిల్లాలో సెప్టెంబరు 14న దళిత యువతిపై అగ్ర వర్ణానికి చెందిన నలుగురు దారుణంగా అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. 


గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్ జూలై 10న జరిగిన సంగతి తెలిసిందే. దుబేను మధ్య ప్రదేశ్‌లో అరెస్టు చేసి ఉత్తర ప్రదేశ్ తీసుకొస్తుండగా, మార్గమధ్యంలో  వ్యాను బోల్తా పడిందని, దుబే పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-10-01T00:29:23+05:30 IST