Abn logo
Mar 26 2020 @ 10:53AM

ఎన్‌వోసీలతో బారులు తీరిన వాహనాలు

నల్గొండ: జిల్లాలోని అన్ని టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులను మూసివేశారు. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లేందుకు ఎన్‌వోసీలతో వాహనాలు బారులు తీరాయి. దీంతో పోలీసులు వాహనదారులను బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. మహిళలు, చిన్నారులు, గంటలు కొద్దీ నిరీక్షిస్తూ..తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ వైపు వెళ్తున్న కార్లు, బైకులను...చిట్యాల మండలం వెలిమినేడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసుల సూచించారు.

Advertisement
Advertisement
Advertisement