మరో ఏడాదిపాటు ఎంపీడీవోలకు వాహన అలవెన్సు

ABN , First Publish Date - 2021-05-06T05:39:13+05:30 IST

జిల్లాలోని ఎంపీడీవోలకు మరో ఏడాదిపాటు వాహన అలవెన్సులు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

మరో ఏడాదిపాటు ఎంపీడీవోలకు వాహన అలవెన్సు

కలికిరి, మే 5: జిల్లాలోని ఎంపీడీవోలకు మరో ఏడాదిపాటు వాహన అలవెన్సులు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపీడీవోలు, తహసీల్దార్లకు నెలకు రూ.35 వేల వంతున వాహన అలవెన్సును ప్రభుత్వం చెల్లిస్తోంది. మండలాల్లో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అద్దె వాహనాలను ఏర్పాటు చేసుకునేందుకు వీరిని అనుమతిచ్చింది. దీని కోసం ప్రతి నెలా ఎంపీడీవోలు, తహసీల్దార్లకు రూ.35 వేలతో అద్దె వాహనాలను సమకూర్చుకోవచ్చు. అయితే ఎంపీడీవోలకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులు గత ఆఽర్థిక సంవత్సరం వరకే పరిమితం కావడంతో ఎంపీడీవోల రాష్ట్ర సంఘం ఈ ఏడాది నిధుల కేటాయింపునకు ప్రభుత్వానికి విన్నవించింది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు చేయాల్సిందిగా పంచాయతీ రాజ్‌ కమిషనరు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో జిల్లాలోని 65 మంది ఎంపీడీవోలకు లబ్ధి చేకూరే విధంగా ప్రస్తుత సంవత్సరానికి నిధులు మంజూరు చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఈ నిధుల విడుదలకు అనుమతించింది. 

Updated Date - 2021-05-06T05:39:13+05:30 IST