చెన్నై, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): నగరంలో అధికశబ్దం చేసే హారన్లను ఉపయోగించే వాహన చోదకులకు రూ.2 వేలు జరిమానా విధించేందుకు రంగం సిద్ధమైంది. అధికశబ్దం చేసే హారన్లను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా ఉపయోగించనున్నారు. నగరంలో చెవులు పిక్కటిల్లేలా శబ్దం చేసే హారన్లను వాహన చోధకులు ఉపయోగిస్తున్నట్లు ఇటీవల ట్రాఫిక్ విభాగం పోలీసులు గుర్తించారు. దీంతో శబ్దకాలుష్య నిరోధక చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు అధికశబ్దం చేసే హారన్లను వాడే వాహన చోధకులకు జరిమానా విధించనున్నారు. ప్రస్తుతం అధికశబ్దం కలిగించే వాహనాలను ఉపయోగించకూడదంటూ తిరువొత్తియూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు అవగాహన ప్రచారం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి