Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వెజ్‌మొఘలాయి పరాఠా

వెజ్‌మొఘలాయి పరాఠా

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- కప్పు, మైదా - కప్పు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత, ఉల్లిముక్కలు - అర కప్పు, అల్లం వెల్లుల్ని పేస్టు- స్పూను, పచ్చి మిర్చి- రెండు, క్యారెట్‌ తరుగు - అర కప్పు, క్యాబేజీ ముక్కలు- కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు - అర కప్పు, కారప్పొడి- స్పూను, ధనియాల పొడి- స్పూను, గరం మసాలా - అర స్పూను, పనీరు తురుము - కప్పు, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.


తయారుచేసే విధానం: ఓ గిన్నెలో గోధుమ పిండి, మైదా, ఉప్పు, స్పూను నూనె వేసి తగినంత నీళ్లతో పిండిలా తడిపి ఓ ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కల్ని బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఆ తరవాత అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పేస్టువేసి రెండు నిమిషాల తరవాత అన్ని కూరగాయల ముక్కల్ని, పొడులని జతచేసి బాగా కలపాలి. కూరగాయలు మెత్తబడ్డాక స్టవ్‌ కట్టేసి పనీరు, కొత్తిమీర తరుగును జతచేయాలి. గోధుమ పిండిని తీసుకుని చపాతీలా వత్తి అందులో కూరగాయల మిశ్రమాన్ని ఉంచి అంచుల్ని జాగ్రత్తగా మూసేయాలి. తరవాత పరాఠాలా వత్తి పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా కాలిస్తే సరి.

మ్యాంగో డిలైట్మ్యాంగో డిలైట్థండాయి సిరప్‌థండాయి సిరప్‌మాల్పువా మాల్పువా మామిడికాయ పులిహోరమామిడికాయ పులిహోరకైరీ మ్యాంగో కర్రీకైరీ మ్యాంగో కర్రీచాక్లెట్‌ రవ్వలడ్డుచాక్లెట్‌ రవ్వలడ్డుస్పైసీ సలాడ్‌స్పైసీ సలాడ్‌కడికడిమెంతుల పులుసుమెంతుల పులుసుఆనపకాయ - గింజల పులుసుఆనపకాయ - గింజల పులుసు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.