చెక్‌డ్యాంలతో సస్యశ్యామలం

ABN , First Publish Date - 2021-07-30T04:54:53+05:30 IST

దేవరకద్ర నియోజకవర్గంలో చెక్‌డ్యాల నిర్మా ణాలతో ఊకచెట్టువాగు సస్యశ్యామలం కానుందని, ఎడారిగా ఉన్న వాగు ఇప్పు డు జలకళను సంతరించుకున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

చెక్‌డ్యాంలతో సస్యశ్యామలం
మద్దూరు గ్రామ శివారులోని ఊకచెట్టువాగులో చెక్‌డ్యాం వద్ద జలపూజ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌ తదితరులు

- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి


చిన్నచింతకుంట, జూలై 29 : దేవరకద్ర నియోజకవర్గంలో చెక్‌డ్యాల నిర్మా ణాలతో ఊకచెట్టువాగు సస్యశ్యామలం కానుందని, ఎడారిగా ఉన్న వాగు ఇప్పు డు జలకళను సంతరించుకున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని మద్దూరు, కురుమూర్తి గ్రామాల మధ్య నగల ఊకచెట్టువాగులో దాదాపు రూ.9కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యాం వద్ద ఆయన జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డితో కలిసి జలపూజ నిర్వహిం చారు. అనంతరం 96 మందికి రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఊకచెట్టు వాగులో నీరు పుష్కలంగా ఉందని, గతంలో ఇది ఎడారిగా కనిపించిందని తెలి పారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెసోళ్లు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ వట్టెం రాజేశ్వరి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు కోట రాము, గ్రామ సర్పంచ్‌ అంజనమ్మ, ఎంపీటీసీ ఫరూఖ్‌, సింగిల్‌విండో చైర్మన్‌లు సురేందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, నాయకులు ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:54:53+05:30 IST