Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూరగాయలే మేలు!

అన్ని రకాల పోషకాలు అందాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా కూరగాయలు ఎక్కవగా తినాలని డాక్టర్లు చెబుతుంటారు. తైవాన్‌కు చెందిన త్సుచీ యూనివర్సిటీ పరిశోధకులు ఆరోగ్యం మీద కూరగాయల భోజనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు.


నాన్‌వెజ్‌ తినేవారితో పోల్చితే వెజిటబుల్స్‌ తినేవారిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు 16 శాతం తక్కువ ఉండడం గమనించారు. వెజిటేరియన్లలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తక్కువగా ఉండడానికి కారణం కూరగాయల్లో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్‌ ఈకోలి బ్యాక్టీరియా వ్దృద్ధిని నియంత్రించడమే అని పరిశోధకులు గుర్తించారు. జీర్ణాశయంలో ఉండే ఈకోలి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి చేరి మూత్రపిండాలు, మూత్రాశయం పనితీరును దెబ్బతీస్తుంది.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement