కూరగాయలు పిరం

ABN , First Publish Date - 2020-10-20T09:02:34+05:30 IST

బీన్స్‌ కూరకు కాస్తంత పచ్చి కొబ్బరితురం.. నాలుగు చుక్కల ని మ్మరసం తగిలిస్తే ఆ రుచే అమోఘమోయీ అంటుంది మనసు! ఽరైతు బజార్లో ..

కూరగాయలు పిరం

  • ఏ కూరగాయైునా కిలో రూ.60కిపైనే..
  • కొత్తిమీర, కలేమాకు, ఆకుకూరలూ అంతే
  • దిగిరాని ఉల్లిగడ్డలు, కోడిగుడ్ల ధరలు 
  • భారీ వర్షాలతోనే ధరలు పెరిగాయా? 

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బీన్స్‌ కూరకు కాస్తంత పచ్చి కొబ్బరితురం.. నాలుగు చుక్కల ని మ్మరసం తగిలిస్తే ఆ రుచే అమోఘమోయీ అంటుంది మనసు! ఽరైతు బజార్లో బోర్డు మీద ఉన్న ధరను చూసి ఇంతింత పెద్దవైన కళ్లు, ఆశ్చర్యంతో తెరుచుకున్న నోరు.. ‘కిలో డెబై రూపాయలట.. అంత ధరకు కొనగలవా?’ అం టూ మనసును కంట్రోల్‌ చేస్తున్నాయి. ఒక్క బీన్సే అనే కా దు.. అన్ని కూరగాయల ధరలూ భగ్గుమంటున్నాయి. ఏదీ రూ.60 పెట్టందే కిలో రావడంలేదు. క్యారెట్‌, క్యాప్సికం వం టివైతే కిలో రూ.80 చొప్పున పలుకుతున్నాయి. ఎప్పుడూ కిలో 30లోపు ఉండే అలుగడ్డ కూడా కిలో రూ.50కి చేరింది.  ‘ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు’ అని బడుగు జీవులు వాపోతున్నారు. ఎర్రగడ్డ రైతు బజార్‌లో శనివారం బీట్‌రూట్‌, క్యాప్సికం, చిక్కుడు, గోకరకాయ రూ. 65 నుంచి రూ.75   పలికాయి. బహిరంగ మార్కెట్‌లో అ దనంగా కిలో రూ.10 నుంచి రూ.20 ఎక్కువగానే ఉంటున్నాయి. చిన్న కొత్తిమీర కట్ట కూడా రూ.10  పలుకుతోంది.  కరివేపాకు, పుదీనా కట్టల ఽధరలూ ఇలానే కొండెక్కాయి. ఆకు కూరల ధరలూ పిరం అయ్యాయి. మెంతెం కూర, పుంటికూర, చుక్కకూర, పాలకూర, తోటకూర వంటివి మనుపు రూ.10కి నాలుగైదు కట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు రెండే ఇస్తున్నారు. ఉల్లిధరలైతే నెల క్రితమే పెరిగికూర్చున్నాయి. ఎర్రగడ్డ రైతు బజార్‌లో కిలో రూ.49 అమ్ముతున్నారు. కిరాణాదుకాణాల్లో రూ.50-రూ.60 తీసుకుంటున్నారు. ఆటో ట్రాలీలో పెట్టుకొని అమ్మేవారేమో రూ.100 కు మూడు కిలోలు ఇస్తున్నారు. భారీ వర్షాలతో కూరగాయల పంటలకు నష్టం జరగడంతోనే ధరలు పెరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 



గుడ్డు రూ.6పైనే.. 

బహిరంగ మార్కెట్‌లో ఆరు నుంచి ఏడు రూపాయలకు ఒక గుడ్డు విక్రయిస్తున్నారు. దీంతో జనం కోడిగుడ్లు కొనడం తగ్గించేశారు. హోల్‌సెల్‌లో అయితే డజను గుడ్లు రూ.64-రూ.68 అమ్ముతున్నారు. చికెన్‌ ధర కూడా వినియోగదారుడికి రుచించడం లేదు. కిలో రూ.220-రూ.240 మధ్య విక్రయిస్తున్నారు. 

Updated Date - 2020-10-20T09:02:34+05:30 IST