మార్కెట్‌కు తగ్గిన కూరగాయల దిగుమతులు

ABN , First Publish Date - 2020-07-13T22:00:01+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తితోప్రజలు వణిపోతున్నతరుణంగా తాజాగా కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి.

మార్కెట్‌కు తగ్గిన కూరగాయల దిగుమతులు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తితోప్రజలు వణిపోతున్నతరుణంగా తాజాగా కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. దీతోఓ ధరలు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిజానికి లాక్‌డౌన్‌ సమయంలోనే ధరలు అందరికీ అందుబాటు ఉన్నాయి కానీ లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత మరింత ఎక్కువగా కరోనా విజృంభిస్తున్ననేపధ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. అలాగే తెలంగాణలోనూ కూరగాయల దిగుబడులు తగ్గాయి. ఎక్కువమంది రైతులు నియంత్రిత సాగుపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. చాలా జిల్లాల్లో కూరగాయల సాగు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే దిగుమతులుతగ్గిపోవడం, తెలంగాణలో పంట తగ్గడం వల్ల ప్రస్త్తుతం హైదరాబాద్‌ నగరానికి కూరగాయల దిగుమతులు 50శాతానికి పైగా తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. 


ముఖ్యంగా టమాటా, బిన్నీసు, గోకరకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, వంకాలు వంటి ప్రధాన పంటలు తక్కువ కావడం వల్లనే ధరలు పెరిగినట్టు అధికారులు తెఇపారు. కరోనా సమయంలోనూ కిలో 10 రూపాయలకు అమ్మిన టమాటా ప్రస్తుతం కిలో 60 రూపాయలు పలుకుతోంది. కర్నాటక నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే క్యాప్సికం ప్రస్తుతం తగ్గిపోవడంతో కిలో 60 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. బిన్నిసు కూడా 30 నుంచి 40 రూపాయలు పలుకగా, ప్రస్తుతం 50 నుంచి 60 రూపాయలకు చేరింది. గోకర కాయ కూడా సైతం కిలో 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. 


వంకాయలు కిఓల 30 నుంచి 40రూపాయలు పలుకుతోంది. ఇక పచ్చి మిర్చి ధరలు కూడా రెండు మూడు వారాల క్రితం 40 రూపాయల కిలో ఉండగా ప్రస్తుతం కిలో 60రూపాయలకు చేరింది. ఇక వీటితో పాటు మరికొన్నిఉత్పత్తుల ధరలు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తి కారణంగా ఇతర రాష్ర్టాల దిగుమతులపై ప్రభావం పడినట్టు అధికారులు తెలిపారు. మరో రెండు నెలల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. 

Updated Date - 2020-07-13T22:00:01+05:30 IST