మార్కెట్లలో భౌతిక దూరం పాటించకపోతే జరిమానా

ABN , First Publish Date - 2020-04-04T10:17:16+05:30 IST

కూరగాయల మార్కెట్లలో భౌతిక దూరాన్ని పాటించకపోతే జరిమానా విధిస్తామని కలెక్టర్‌ గంధం చంద్రుడు హెచ్చరించా రు.

మార్కెట్లలో భౌతిక దూరం పాటించకపోతే జరిమానా

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం అర్బన్‌, ఏప్రిల్‌ 3 : కూరగాయల మార్కెట్లలో భౌతిక దూరాన్ని పాటించకపోతే జరిమానా విధిస్తామని కలెక్టర్‌ గంధం చంద్రుడు హెచ్చరించా రు. ఈ మేరకు శుక్రవారం ఆయ న ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లతోపాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. అదేవిధంగా కిరాణా షాపు లు, సూపర్‌ మార్కెట్ల వద్ద కూడా తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.


మతపెద్దలు సహకరించాలి

కరోనా వైరస్‌ను అరికట్టడంలో మతపెద్దలు సహకరించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు కోరారు.  శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతపెద్దలతో ఆయన సమావేశమయ్యారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రస్తు తం అత్యవసర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రాబోవు మహవీర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడే, షబ్‌-ఏ-బరాత్‌ పండుగలను ఇం ట్లోనే ఉండి జరుపుకునేలా మతపెద్దలు అవగాహన కల్పించాలన్నారు. అందరికీ మైకులు, ఫోన్‌లు, మెసేజ్‌ల ద్వారా తెలియజేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ప్రజలు గుమిగూడి పండుగలు నిర్వహించరాదన్నారు. ఆయా దేవాలయాల్లో పూజారులు, పాస్టర్లు, ఇమామ్‌లు పూజలు, ప్రార్థనలు నిర్వహించాలన్నారు. 

Updated Date - 2020-04-04T10:17:16+05:30 IST