Abn logo
Mar 29 2020 @ 05:52AM

ఇళ్ల వద్దే కూరగాయాల విక్రయం

సూళ్లూరుపేట, మార్చి 28: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సూళ్లూరుపేటలో కూరగాయాలను ప్రాంతాల వారీగా వాహనాలలో ఇళ్లవద్దకు వెళ్లి విక్రయించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జూనియర్‌ కళాశాల, రైతు బజారు వద్ద కూరగాయాల విక్రయించేలా ఏర్పాట్లు చేసినా గుంపులు గుంపులుగా జనం వస్తుండటంతో రద్దీని నివారించేందుకు ఇలా ఇళ్ల వద్దకే వాహనాలలో వెళ్లి కూరగాయాలను విక్రయింపచేస్తున్నారు.


ఒక్కో ప్రాంతానికి ఒక్కో మొబైల్‌ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇలా అన్ని ప్రాంతాలలో ప్రజల వద్దకే వెళ్లి కూరగాయాల విక్రయించారు. దాంతో బజారులో రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. 

Advertisement
Advertisement
Advertisement