వీగన్‌ వారియర్స్‌!

ABN , First Publish Date - 2021-12-09T05:45:37+05:30 IST

మాంసాహారం, శాకాహారం తినేవాళ్లు మన చుట్టూ చాలామంది ఉంటారు. అయితే కొందరు ఒకింత ప్రత్యేకం.. వారే వీగన్స్‌.

వీగన్‌ వారియర్స్‌!

మాంసాహారం, శాకాహారం తినేవాళ్లు మన చుట్టూ చాలామంది ఉంటారు. అయితే కొందరు ఒకింత  ప్రత్యేకం.. వారే వీగన్స్‌. ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ర్టాల్లో బాగా వినిపిస్తోన్న పదం- వీగన్‌. ఇంతకీ  వీగన్‌ ఫుడ్‌ అంటే ఏంటీ? ఈ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయి? అనే విషయాలతో పాటు  వీగన్‌ కల్చర్‌ను మరింతగా పరిచయం చేస్తున్నారు  వీగనర్స్‌ ..  ప్రణవి, రూపా రెడ్డి. ఈ వీగన్‌ వారియర్స్‌ను నవ్య పలకరించింది. 


ల్ట్‌మార్ట్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా వీగన్‌ చాక్లెట్‌, వీగెన్‌ చికెన్‌ కర్రీ కట్‌, మాక్‌ మీట్‌, వీగన్‌ పన్నీర్‌(వాల్నట్స్‌, ఆల్మండ్స్‌తో చేస్తారు), మైసూర్‌పాక్‌, పాలు, పెరుగు, కుకీస్‌, ఐస్‌ క్రీమ్స్‌.. ఇలా 500 రకాల వీగన్‌ ఆహార ఉత్పత్తులను హైదరాబాద్‌లో డెలివరీ చేస్తాం. ఇందుకోసం మేం యాభై సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. 


ఆల్టర్‌నేట్‌ జీవిన విధానం.. 

నేను మాంసాహారినే. వీగనిజం గురించి తెలిశాక మాంసాహారం మానేశా. జంతువులను హింసించటం ఇష్టంలేక పాల ఉత్పత్తులు వద్దనుకున్నా. పూర్తి వీగన్‌ అయ్యాక.. ప్రణవి పరిచయం అయ్యింది. మా డిష్కషన్‌లో వీగన్‌ ఫుడ్‌ ఎవరు చేస్తున్నారు? ఎంత మంది ఉండొచ్చు? లాంటివి మాట్లాడుకునేవాళ్లం. ఓ ఫ్లాట్‌ఫామ్‌ ఉంటే బావుంటుందనుకున్నా. అదీగాక నేను మైక్రోసా్‌ఫ్టలో సప్లైయింగ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పని చేసిన అనుభవం ఉంది కాబట్టే.. ధైర్యంగా ఆల్ట్‌మార్ట్‌ను ప్రారంభించా. ఆల్టనరేట్‌ లైఫ్‌స్టయిల్‌ను సూచించే విధంగా ఉంటుందని ‘ఆల్ట్‌’ పదాన్ని యాడ్‌ చేశా. లోగో మీద హ్యాపీగా ఉండే ఆవు బొమ్మను వేశాం. మా వల్ల ఆవు హ్యాపీగా ఉంటుందని దానర్థం. 


సమంతా మెచ్చింది.. 

వీగన్‌ ఫుడ్‌ ఏది తిన్నా ఆరోగ్యంతో పాటు ఆనందం. ఇపుడిపుడే జనాల ఆదరణ పెరుగుతోంది. క్యూరియ్‌సగా ఉన్నారు. గేమ్‌ చేంజింగ్‌, ఫిట్‌నెస్‌ అని సెలబ్రిటీలు చెప్పడంతో వీగన్‌ ఫుడ్‌పై ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా ఒకసారి ప్రయత్నిస్తే పోలా.. అనేవాళ్లూ ఉన్నారు. హైదరాబాద్‌లో వీగన్‌ ఫుడ్‌ ఫలానా చోటు ఉందని వెతకాల్సిన పనిలేదు. మా సంస్థ ఇంటికే డెలివరీ చేయడం వల్ల చాలా మంది కస్టమర్లు ఒకేసారి డిఫరెంట్‌ ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకుంటున్నారు. ఆర్డర్‌ అంటే గుర్తొచ్చింది.. హీరోయిన్‌ సమంతా ఓ సారి ఇన్‌స్టా బిన్‌లో ఏమి ఆర్డర్‌ చేయాలో అర్థం కాలేదని మెసేజ్‌ పెట్టారు. వెంటనే పీనట్‌ పెరుగు, చాక్లెట్స్‌, హెల్తీ బైట్స్‌.. ఇలా వీగన్‌ ఫుడ్‌ పంపించాం. చాలా టేస్టీగా ఉందని.. మేం అడక్కుండానే ఇన్‌స్టాలో ఆల్ట్‌మార్ట్‌ గురించి రాసింది. అదెంతో మాకు బూస్టప్‌ ఇచ్చింది. ఆమె ఒక్కమాటతో.. మా సంస్థ గురించి హైదరాబాద్‌లోని యూత్‌కి బాగా తెలిసింది. చెన్నైలోని కొందరు సెలబ్రిటీలు ఆర్డర్‌ చేశారు. పంపించాం. మా సంస్థ క్యాటలాగ్‌ పాన్‌ ఇండియాలో ఉంది. ముంబై, చెన్నైల్లోని వీగన్‌ ఫుడ్‌ మేకింగ్‌ సంస్థలతో టైయప్‌ అయ్యాం. 


అదే మా చాలెంజ్‌..

సరిగ్గా ఆల్ట్‌మార్ట్‌ పనుల్లో ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ పడింది. ఆ సమయంలో వీగన్‌ ఫుడ్‌ను డెలివరీ చేయటం మాకో సవాల్‌. అయినా సరైన సమయానికి కస్టమర్లకు డెలివరీ చేశాం. దీంతో జనాలకు కనెక్టయ్యాం. కేవలం లక్ష రూపాయల ఖర్చుతో ఆల్ట్‌మార్ట్‌ ప్రారంభించా. స్కేల్‌ చిన్నదయినా.. గట్టిగా పనిచేశాం. కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఊరికే చెప్పటం కాదు..మా ఇంటికి వచ్చిన చుట్టాలకు, స్నేహితులకూ..మాక్‌ మీట్‌ బిర్యానీ, ఐస్‌ క్రీమ్స్‌ పెడతాం. అలా చుట్టూ సమాజానికి అవగాహన కల్గిస్తున్నా. మార్కెట్‌లో ఫలానా ఉత్పత్తి ఉందని జనాలకు తెలియజేయాలనేదే నా తాపత్రయం. అందుకే మార్కెట్లోకి వచ్చిన కొత్త వీగన్‌ ఉత్పత్తుల గురించి నిత్యం అప్‌డేట్‌ అవుతుంటా. 


అదే నా కల.. 

 వీగన్‌ ఫుడ్‌  కాఫీ షాపులు, రెస్టారెంట్స్‌లో లభించాలి. ఇంట్లో తినేవన్నీ వీగన్స్‌లో దొరికే రోజొకటొస్తుంది. గోవాలో వీగన్‌ ఫుడ్‌ బాగా లభ్యమవుతుంది. త్వరలో విదేశీ ఉత్పత్తులు దేశంలోకి మరింతగా వచ్చే అవకాశం ఉంది. తద్వారా వీగన్‌ ఫుడ్‌ సంస్థలకు ఇన్‌వెస్టర్లూ దొరుకుతారు. భవిష్యత్‌లో ఈ ఫుడ్‌దే హవా. త్వరలో పదిహేను వందల రకాల ఉత్పత్తుల వరకూ పెంచుతాం. వీగన్‌ అంటే.. ఆల్ట్‌మార్ట్‌ మాత్రమే గుర్తుకురావాలన్నదే ఆశ. భవిష్యత్‌లో జంతువుల పరిరక్షణ కోసం పనిచేయాలన్నదే కల.

 రాళ్లపల్లి రాజావలి,  ఫొటోలు: అశోకుడు 



వెజిటేరియన్‌ ఆంగ్లపదంలోని తొలి మూడు అక్షరాలను.. చివరి రెండక్షరాలను కలిపితే ‘వీగన్‌’ అనే పదం పుట్టింది. వీగన్‌ ఫుడ్‌ తినేవాళ్లను ప్లాంట్‌ బేస్డ్‌ అంటారు. వీగనిజం.. ఓ జీవన విధానం. ఖాదీ వస్ర్తాలనే ధరిస్తాం. పట్టుపురుగులను చంపి తీసిన పట్టువస్ర్తాల జోలికెళ్లం. జంతువుల చర్మంతో చేసిన లెదర్‌ బ్యాగ్స్‌, బెల్టులు, చెప్పులు వాడం. ఏ జంతువు బతుకుకి హాని కలిగించకుండా ఉండటమే వీగనిజం.


అలా వీగన్‌ అయ్యాను..

అమెరికాలో పాలు, వాటి ఉత్పత్తులైన పెరుగు, వెన్న లాంటివి తిన్నప్పుడు మొటిమలు, పీసీఓడీ సమస్యలతో ఇబ్బంది పడ్డా. పెళ్లయ్యాక ముంబైలో కొన్నాళ్లున్నాం. అక్కడ ఓ వైద్యురాలు పాలు, పెరుగు, చక్కెర మానేయమంది. వీగన్‌ ఫుడ్‌ తీసుకోమని సలహా ఇచ్చింది. ఆల్మండ్‌ మిల్క్‌తో టీ, కాఫీ చేసుకోవటం ప్రారంభించాం. పెరుగుతో ఇబ్బందయిపోయింది. వదల్లేకపోయా. అమ్మానాన్న ప్రోత్సాహంతో వీగన్‌ ఫుడ్‌ తయారు చేయడం నేర్పించే శరణ్‌ ఆర్గనైజేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నా. కుకింగ్‌ అంటే మనకిష్టం. అందుకే వెంటనే ఎక్స్‌పర్మెంట్స్‌ చేశా. పల్లీలతో పెరుగు చేశాక.. నాకే నచ్చలేదు. అదే సమయంలో లాక్‌డౌన్‌ పడింది. దీంతో రకరకాల నట్స్‌తో పెరుగు చేయడం ప్రయత్నించా. జీడిపప్పు పెరుగు బాగా వచ్చింది. నేనప్పుడు ఏడు నెలల గర్భిణిని. ఆ సమయంలోనే వీగన్‌ ఉత్పత్తులు తయారు చేసి స్నేహితులకు పంపిస్తే.. అందరికీ నచ్చాయి. బ్రాండ్‌ చేయమన్నారంతా. అలా ‘ఏన్యా’ కి బీజం పడింది.   


ఇదీ మా ఫుడ్‌ ప్రత్యేకత..

పాల ఉత్పత్తులకు ఆల్టర్‌నేట్‌గా వీగన్‌ ఫుడ్‌ తయారు చేస్తాం. జీడిపప్పు పెరుగు, జీడిపప్పు తీపి పెరుగు, బేసన్‌ లడ్డూ, చీజ్‌లూ లభిస్తాయి. నేను చేసిన ఫస్ట్‌ వీగన్‌ ఫుడ్‌ పెరుగు. జీడిపప్పు పెరుగును అన్నంలో, దహీ వడతో పాటు పాపిడి చాట్‌ చేసుకుని తినొచ్చు. తియ్యటి జీడిపప్పు పెరుగు ఫ్రూట్స్‌తో, కార్న్‌ఫ్లెక్స్‌తో తినొన్చు. స్వీట్‌ కర్డ్‌లో వెన్నెల ఫ్లేవర్‌, మిక్స్‌డ్‌ బెర్రీ ఫ్లేవర్స్‌ ఉన్నాయి. చక్కెర ఉపయోగించం. తియ్యదనం కోసం తాటిబెల్లం వాడతాం. మా ఉత్పత్తులు అన్నీ కలిపి ఏన్యా అనే పేరుతో బ్రాండ్‌ తీసుకొచ్చాం. ఏన్యా అంటే బీజమనే అర్థం. వీగన్‌ ఫుడ్‌ ఆరోగ్యానికి మంచిది. సులువుగా జీర్ణమయ్యే ఈ ఆహారం రుచిలోనూ ఏ మాత్రం తగ్గదు. మేం సైనిక్‌పురిలో ఉంటాం. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తో పాటు ఆల్ట్‌మార్ట్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా హైదరాబాద్‌లో మాత్రమే ఫుడ్‌ డెలివరీ చేస్తాం. 


అదే నా ఆలోచన..

వీగన్‌ అయ్యాక ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవు. బరువు తగ్గా. నాకో బాబు కూడా పుట్టాడు. మా ఆయన విశ్వతేజ్‌ అండతో ఈ ప్రొడక్ట్స్‌ తయారు చేస్తున్నా. వీగన్‌ ఫుడ్‌తో నా జీవితమే మారిపోయింది. అందుకే మార్కెట్‌ ప్లేస్‌లోకి వచ్చా. ప్రస్తుతం మా ఇంటినుంచే ప్రొడక్ట్స్‌ చేస్తున్నాం. త్వరలో జూబ్లీహిల్స్‌లో స్టాల్‌ ఏర్పాటు చేస్తాం. కోవిడ్‌తో హెల్తీ ఫుడ్‌ తినాలనే ఆలోచన జనాల్లో పెరిగింది. వీగన్‌ వైపు వస్తున్నారు. మా ఉత్పత్తులు తిన్నవాళ్లు ‘వీగన్‌ మిల్క్‌, పెరుగు చేసి మమ్మల్ని బతికిస్తున్నారు’ అంటున్నారు. నా శ్రీమంతం సమయంలో వీగన్‌ స్వీట్స్‌ కావాలనిపించింది. కుదరలేదు. అందుకే  వీగన్‌ హల్వా, వీగన్‌ మైసూర్‌ పాక్‌, వీగన్‌ లడ్డూలను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం. డైరీ ప్రొడక్ట్స్‌తో చేసే ప్రతి ఆహారం వీగన్‌లో కూడా తయారు చేయాలన్నదే మా లక్ష్యం. ఫ్యాక్టరీ లెవల్‌కి వెళ్లి తక్కువ ధరకే అందించాలి. దీంతో పాటు మారుమూల పల్లెలకూ మా ఉత్పత్తులు వెళ్లాలనేదే మా కల.

Updated Date - 2021-12-09T05:45:37+05:30 IST