Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వెజ్‌ తెహ్రీ

వెజ్‌ తెహ్రీ

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డ ముక్కలు - కప్పు, కాలీఫ్లవర్‌- రెండు కప్పులు, క్యారెట్‌ - అర కప్పు, బీన్స్‌ ముక్కలు- అర కప్పు, పచ్చి బఠానీలు- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, టొమాటో ముక్కలు- ముప్పావు కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు- స్పూను, కొత్తిమీర తరుగు- పావు కప్పు, కారం- స్పూను, పసుపు- అర స్పూను, లవంగాలు- 4, యాలకులు- రెండు, ధనియాలు- స్పూను, దాల్చిన చెక్క- రెండు, బాస్మతి బియ్యం- ఒకటిన్నర కప్పు, నెయ్యి- రెండు స్పూన్లు, నీళ్లు, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టాలి. కాలీఫ్లవర్‌ ముక్కల్ని వేడి నీళ్లలో పావుగంట పాటు నానబెట్టి నీళ్లని వడగట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి. రెండు నిమిషాల తరవాత ఉల్లిముక్కల్నీ కలపాలి. ఉల్లి రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్టును వేయాలి. టొమాటోలు జత చేయాలి. మిగతా కూరగాయల ముక్కల్నీ వేసి బాగా కలపాలి. ఆ తరవాత బియ్యాన్నీ తగినంత నీటినీ, ఉప్పునీ వేసి కలిపి మూత పెట్టి ఉడికిస్తే వెజ్‌ తెహ్రీ రెడీ. ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ వంటకాల్లో ఇదొకటి.

పనస బిర్యానీపనస బిర్యానీమామిడికాయ పులిహోరమామిడికాయ పులిహోరవెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ కోఫ్తా బిర్యానీకొత్తిమీర రైస్‌కొత్తిమీర రైస్‌పైనాపిల్‌ పులావ్‌పైనాపిల్‌ పులావ్‌Mexican ఫ్రైడ్‌ రైస్‌ Mexican ఫ్రైడ్‌ రైస్‌ నరంజ్‌ పులావునరంజ్‌ పులావుమటర్‌ పులావ్‌మటర్‌ పులావ్‌పన్నీర్ పులావ్ (వీడియో) పన్నీర్ పులావ్ (వీడియో) ప్రసాదం పులిహోరప్రసాదం పులిహోర
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.