Veerappan సోదరుడుమాతయ్యన్‌కు త్రీవ అస్వస్థత

ABN , First Publish Date - 2022-01-10T17:40:44+05:30 IST

గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ సోదరుడు మాతయ్యన్‌ (87) సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ అధికారి హత్య కేసులో కోయంబత్తూరు సెంట్రల్‌ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు

Veerappan సోదరుడుమాతయ్యన్‌కు త్రీవ అస్వస్థత

చెన్నై: గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ సోదరుడు మాతయ్యన్‌ (87) సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ అధికారి హత్య  కేసులో  కోయంబత్తూరు సెంట్రల్‌ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. కొన్ని నెలలకు ముందు వృద్ధాప్య సమస్యల కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందాడు. తర్వాత పదిహేను రోజులకు ముందు గుండెపోట వచ్చింది. దీంతో పోలీ సులు ఆయనను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి జైలుకు తిరిగి వెళ్ళారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మళ్ళీ మాతయ్యన్‌కు గుండెపోటు వచ్చింది. పోలీసులు వెంటనే అతడిని సేలం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడిని అత్యవసర చికితా విభాగంలో ఉంచి చికిత్సలందిస్తున్నారు.

Updated Date - 2022-01-10T17:40:44+05:30 IST