వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల

ABN , First Publish Date - 2022-05-16T06:50:13+05:30 IST

మండలంలోని తమ్మలూరు వేంచేసిన శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల
తమ్మలూరులో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభ

ముండ్లమూరు, మే 15 : మండలంలోని తమ్మలూరు వేంచేసిన శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ నెల 11న బ్రహ్మంగారి ఆరాధన వర్షం కారణంగా జరగక పోవడంతో తిరిగి భక్తులు ఆదివారం అత్యంత వైభవంగా కనుల పండవగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారికి, గోవిందాంబిక, ఈశ్వరమ్మ, పోతులూరయ్య స్వాములను ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులతో దేవాలయం పోటెత్తింది. ఆరాధన మహోత్సవంలో భాగంగా గ్రామ వాల్మికి సంఘం ఆధ్వర్యంలో ఒక విద్యుత్‌ ప్రభను ఏర్పాటు చేసి దానిపై పాట కచేరి ఏర్పాటు చేశారు. ఇది భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. తమ్మలూరు గ్రామస్తులతో పాటు నాయుడుపాలెం, ఉమామహేశ్వర అగ్రహారం, పెదరావిపాడు, ముండ్లమూరు గ్రామాలకు చెందిన భక్తులు జాతరకు వెళ్లి తిలకించారు. 

దర్శి : మండలంలోని బొట్లపాలెం గ్రామంలో ఆదివారం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా టీడీపీ వర్గీయులు రెండు ప్రభలు, వైసీపీ వర్గీయులు మూడు ప్రభలు ఏర్పాటు చేశారు. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాదన సందర్భంగా గత గురువారం జరగాల్సిన తిరునాళ్ల వాయిదా పడింది. బొట్లపాలెం గ్రామానికి చెందిన ఇరువర్గీయులు ప్రభలు ఏర్పాటు చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పమిడి రమేష్‌, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టిపాపారావు టీడీపీప్రభలపై పాల్గొని కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకులు మద్దిశెట్టి శ్రీధర్‌ ఉత్సవాల్లో పాల్గొని వైసీపీ ప్రభలపై కార్యకర్తల నుదేవించి మాట్లాడారు. ఈ ఉత్సవాల్లో బొట్లపాలెం, పొతకమూరు, చెరువుకొమ్ముపాలెం, పాపిరెడ్డిపాలెం, తూర్పువీరాయపాలెం, సామంతపూడి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పామూరు : మండలంలోని రేణిమడుగులో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలకు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శనివారం ఘనంగా జరుపుకోన్నారు, వేడుకల్లో భాగంగా ఆదివారం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో దేవతామూర్తుల ఉత్సవ విగ్రహలను అలంకరించి గ్రామ ప్రధాన వీధుల్లో మేళ తాళా లతో బాణసంచా కాలుస్తూ, గ్రామోత్సవం, ఒకరిపై ఒకరు  రంగులు చల్లుకుంటూ వసంత్సోవం, పారువేట, కార్యక్రమాలను అంగరంగ వైభవంగా గ్రామస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కాయ, కర్భూరంతో ప్రత్యేకపూజలు జరుపుకోని మొక్కులు తీర్చుకున్నారు.

నారాయణస్వామి ఆలయంలో పూజలు

సీఎస్‌పురం : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణ స్వామి ఆ లయంలో ఆది వారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు ఎం.సత్యనారా యణశర్మ స్వామివారి మూలవిరాట్‌ను వివిధ రకా ల పూలమాలలతో ప్రత్యేకం గా అలంకరించి స్వామి వారికి పంచా మృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలో గోపూజ చేశారు. భక్తులు మహానైవేధ్యంతో గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి స్వామివారికి సమర్పించారు. రాత్రికి నారాయణస్వామివారికి పల్లకిసేవ, రథోత్సవం నిర్వహించారు.


Updated Date - 2022-05-16T06:50:13+05:30 IST