Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

నూతనంగా ఆలయ నిర్మాణం

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న 

ఎరిక్షన్‌బాబు, డాక్టర్‌ మన్నె  

ఎర్రగొండపాలెం, అక్టోబరు 25 : మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవం సో మవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా  భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. ఆ సమయంలో భక్తులు శాంతి పూజలు నిర్వహించారు. ఈ సమయంలో పూర్ణా ఆహుతి  పూజ లు నిర్వహించారు.  వెం కటాద్రిపాలెం గ్రామప్రజలు  భక్తికి చిహ్నంగా శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సుందరంగా ని ర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించారు. 

పాల్గొన్న టీడీపీ నాయకులు

వెంకటాద్రిపాలెం గ్రామంలో జరిగిన వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో  టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, జడ్పీమాజీ ఉపాధ్యక్షు డు డాక్టరు మన్నె రవీంద్ర,  వెంకటాద్రిపాలెం సర్పంచి బోడా శ్రీశైలపతినాయుడు, రాష్ట్రటీడీపీ తెలుగు యువత నాయకులు నలగాటి చిన్న మల్లికార్జుననాయుడు,  ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, మాజీ టీడీపీ అధ్య క్షుడు వడ్లమూడి లింగయ్య, తెలుగు యువత నాయకులు   వేగినాటి శ్రీను, కాశీకుంట స ర్పంచి మంత్రునాయక్‌, మాజీ స ర్పంచులు  కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, చెవు ల అం జయ్య, ఆళ్ల నాసరరెడ్డి, రైతు సంఘ అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, ముత్తలూరి మల్లికార్జునాచారి పాల్గొని పూజలు నిర్వహించారు. వెంకటాద్రిపాలెం చుట్టూపక్కల గ్రా మాల ప్రజలు పా ల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. Advertisement
Advertisement