వీడని సందిగ్ధం

ABN , First Publish Date - 2022-01-19T04:23:05+05:30 IST

పెన్నా పొర్లుకట్టల నిర్మాణానికి సంబంధించి సందిగ్ధం వీడడం లేదు. రోజులు, నెలలు గడుస్తున్నా ఇంకా నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కొలిక్కి రాలేదు.

వీడని సందిగ్ధం
వరద ప్రవాహం తగ్గిన పెన్నానది

కొలిక్కిరాని పెన్నా పొర్లుకట్టల వ్యవహారం

మట్టికట్టల నిర్మాణానికి టెండర్లు పూర్తి

తాజాగా కాంక్రీట్‌ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు

మళ్లీ టెండర్లు ఆహ్వానానికి సన్నాహాలు 

ప్రక్రియ పూర్తయి.. పనుల ప్రారంభమెప్పుడో ?

మరో 8 నెలలే సమయం

ముంపు వాసుల్లో ఆందోళన


నెల్లూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : పెన్నా పొర్లుకట్టల నిర్మాణానికి సంబంధించి సందిగ్ధం వీడడం లేదు. రోజులు, నెలలు గడుస్తున్నా ఇంకా నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కొలిక్కి రాలేదు. 2020లో వరదలకు నెల్లూరు నగరంలోని పెన్నా పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. అప్పట్లో పొర్లుకట్టలు నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియ టెండర్ల దశకు వెళ్లేందుకు ఏడాది సమయం పట్టింది. దీంతో వరుసగా రెండోసారి ఆ ప్రాంతా లు వరద ముంపునకు గురయ్యాయి. 2021 నవంబరులో పొర్లుకట్టల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయింది. కానీ తాజాగా పొర్లుకట్టలు(మట్టిక ట్టలు)స్థానంలో కాంక్రీటు గోడలు నిర్మించాలన్న ప్రతిపాదన లు తెరపైకి వచ్చాయి. దీంతో ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తా జా ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించా రు. అక్కడి నుంచి ఆమోదం వచ్చేది ఎప్పుడు? మళ్లీ కొత్తగా ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్లు పిలిచేది ఎప్పుడు? పనులు మొదలయ్యేది ఇంకెప్పుడు? అన్న చర్చలు జరుగు తున్నాయి. అక్టోబరు నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆలోపే పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరి ఆ లోపు కాంక్రీట్‌ గోడలు నిర్మాణాలు పూర్తవుతాయా? ముంపు వాసులకు వరద నుంచి ఉపశమనం కలుగుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 


వరుసగా రెండుసార్లు


వర్షాకాలం వస్తోందంటేనే నెల్లూరు నగరంలోని వెంకటే శ్వరపురం, భగతసింగ్‌ కాలనీ, జనార్దనరెడ్డి కాలనీ, ఇస్లాంపే ట ప్రాంతాలు వణికిపోతాయి. గడిచిన రెండేళ్లుగా వరుసగా పెన్నానదికి భారీగా వరద పోటెత్తింది. దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కులకుపైగా నీరు పెన్నానదిలో పారింది. దీంతో పరివాహక ప్రాంతాలైన ఈ కాలనీలు వరద ముంపు నకు గురయ్యాయి. 2020, 2021 సంవత్సరాల్లో దాదాపు వారంపాటు వేలాది ఇళ్లు నీటిలో ఉండిపోయాయి.  వేల మంది ప్రజలు ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకున్నారు. ఇళ్లల్లోని వస్తువులు పూర్తిగా దెబ్బతిన డంతో పేద కుటుంబాలు ఆర్థికంగా బాగా చితికిపోయాయి. ప్రభుత్వం అరకొరగా సాయం చేస్తున్నా అది ఏమాత్రం సరిపోలేదు. తమకు నష్టం జరిగిన తర్వాత పరిహారం కన్నా ఆ నష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవా లని నెల్లూరు నగరంలోని ముంపు ప్రాంతవాసులు కొన్నేళ్ల నుంచి కోరుతున్నారు. వరద ముంపు నుంచి తప్పించుకో వాలంటే నగర పరిధిలో పెన్నానదికి ఇరువైపులా పొర్లుక ట్టలను నిర్మించడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిం చారు. ఈ క్రమంలో 2020లో వరదల తర్వాత పొర్లుకట్టల నిర్మాణానికి ఇరిగేషన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపారు. అయితే చాలా ఆలస్యంగా ప్రభుత్వం నుం చి అనుమతులు లభించాయి. ఈ కారణంగానే వరుసగా రెండో ఏడాది కూడా  ఆయా కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. 


త్వరగా మొదలయ్యేనా..?


రూ.80.50 కోట్ల అంచనాతో గత నవంబరులో కొత్త రైల్వే బ్రిడ్జి నుంచి జాతీయ రహదారి వరకు పెన్నానదికి ఇరు వైపులా పొర్లుకట్ట(మట్టికట్టలు)లను నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్‌ కోసం అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీని నెలకొన్నట్లు ప్రచారం జరిగింది. ఇద్దరు కీలక నేతల జరిగిన పోటీలో దాదాపు 13 శాతం లెస్‌కు ఓ కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్త య్యాక మట్టికట్టల స్థానంలో కాంక్రీటు గోడలు నిర్మించాల న్న ప్రతిపాదనలు తెరపైకికొచ్చాయి. కానీ అధికారులు ఎందుకు ముందుగా ఈ ఆలోచన చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది వచ్చిన వరదలకు పెన్నా పరివాహక ప్రాంతం చాలా వరకు కోతకు గురైందని, ఇప్పుడు అక్కడ మట్టికట్ట నిర్మిస్తే చాలా ఇళ్లను తరలించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో మట్టి కట్టల స్థానంలో కాంక్రీటు గోడలు నిర్మిస్తే ఇళ్లు కోల్పోయే వారి సం ఖ్య తగ్గుతుందని అంటున్నారు. ఇదే సమయంలో అక్కడి ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో కొత్త ప్రతిపాదన లు తయారు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. అయితే మట్టికట్టల స్థానంలో కాంక్రీటు గోడలు నిర్మించాలని యోచి స్తుండడంతో మళ్లీ మొదటి నుంచి ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుందని ఇంజనీర్ల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పిలిచిన టెండర్‌ను ఏం చేయాలన్న దానిపై ఇరిగేషన అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడి నుంచి ఇంకా సమాధానం రాలేదు. ప్రభుత్వం తీసు కునే నిర్ణయాన్ని బట్టి మళ్లీ కొత్తగా ఎస్టిమేషన్లు తయారు చేసి పంపాల్సి ఉంది. దాన్ని ఆమోదించాక టెండర్ల ప్రక్రియ నిర్వహించాలి. అది పూర్తయ్యాక కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీ వోటీ)కు పంపి ఆమోదం పొందాక కాంట్రాక్టర్‌తో అగ్రిమెం టు చేసుకోవాలి. ఇదంతా పూర్తవ్వడానికి ఎంత సమయం పడుతుందన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అత్యవసరమైన వర్కు కాబట్టి చకచకా ఫైళ్లు కదులుతాయా.. లేదా? అన్నది చూడాలి. అయితే పెన్నానదిలో ఏ పని చేసినా అక్టోబరులో పే చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తర్వా త వర్షాలు కురవడం, పెన్నాకు వరద వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నా రు. ఈ ఏడాది కూడా పెన్నా రక్షణ గోడల నిర్మాణం పూర్తికాకపోతే తమ పరిస్థితి ఏమిటని ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా గతేడాది వరదల సమయంలో జిల్లాకు వచ్చి సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి.. పండగ పోయాక పెన్నా పొర్లుకట్టల నిర్మాణానికి శంకుస్థాప న చేస్తానని ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యమ య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-01-19T04:23:05+05:30 IST