వేడుకగా కృష్ణాష్టమి

ABN , First Publish Date - 2022-08-19T03:22:36+05:30 IST

స్ధానిక వేదగర్భ పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. శుక్రవారం సెలవు కావడంతో ముందస్తుగానే తమ

వేడుకగా కృష్ణాష్టమి
వేదగర్భలో జరిగిన సంబరాల్లో చిన్నారులు

సీతారామపురం, ఆగస్టు 18: స్ధానిక వేదగర్భ పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. శుక్రవారం సెలవు కావడంతో ముందస్తుగానే తమ పాఠశాలలో వేడుకలను నిర్వహించినట్లు కరస్పాండెంట్‌ బొల్లు రామ్మోహన్‌ తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు. అనంతరం పలు తరగతుల విద్యార్థులు వివిధ వేషధారణలతో, సంగీత, నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 



కావలిలో..


కావలి టౌన్‌ : పట్టణంలోని పలు పాఠశాలల్లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.  గాయత్రీనగర్‌లోని నలందా ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌లోనూ, వెంగళరావునగర్‌లోని నలందా ఈ టెక్నో పాఠశాలలోనూ, రాజావారివీధిలోని ఓవెల్‌ మినర్వా పాఠశాలలోనూ  వేడుకలు జరిగాయి. పాఠశాలల ఆవరణను చిన్నారులు రంగురంగుల ముగ్గులతో  సుందరంగా అలంకరించారు. అనంతరం ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్ధులు రాధాకృష్ణుల వేషధారణలో ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. నలందా విద్యాసంస్ధల ఎండీ మజహర్‌ మాట్లాడుతూ  పాఠశాలలో ఇలాంటి వేడుకలు నిర్వహించడం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుంచే మన సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కలుగుతుందన్నారు.  కార్యక్రమాలలో ఆయా పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు పాల్గొన్నారు. 






Updated Date - 2022-08-19T03:22:36+05:30 IST