పెండింగ్‌ ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-06-20T05:40:24+05:30 IST

ఓటరు నమోదు కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌గోయల్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

పెండింగ్‌ ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌


మెదక్‌రూరల్‌/సంగారెడ్డిరూరల్‌, జూన్‌ 19: ఓటరు నమోదు కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌  శశాంక్‌గోయల్‌ జిల్లా  కలెక్టర్లకు  సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియోకాన్పరెన్స్‌ నిర్వహించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను రోజువారీగా పరిష్కరించాలని సూచించారు. ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 25న చేపట్టిన ఎక్ర్టానిక్‌ ఫొటోఐడెంటీకార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారంతా డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలన్నారు. ఈవీఎంలను  భద్రపర్చేందుకు నిర్మిస్తున్న గోదాములను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న గోదాములు రెండునెలల్లో పూర్తవుతాయని తెలియజేశారు. అదనంగా ఒకహాలు నిర్మాణానికి అనుమతించాలని కోరగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా సీఈవో సూచించారు. మెదక్‌ జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ రమేష్‌, స్వీప్‌ నోడల్‌అధికారి, జిల్లాసైన్స్‌ అధికారి రాజిరెడ్డి, సంగారెడ్డి నుంచి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు, ఆర్డీవోలు నగే్‌షగౌడ్‌, రమే్‌షబాబు, ఎన్నికలసెల్‌ అధికారి ఉమర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:40:24+05:30 IST